తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడిపై తిరుగుబాటు ప్రారంభ‌మైంది. మీరే మాకు అధిష్టానం.. మీ మాటే మాకు వేద‌వాక్కు.. అంటూనే విజ‌య‌వాడ నేత‌లంతా తిరుగుబాటు చేశారు. ఎంపీ కేశినేని నాని కావాలో?  మేం కావాలో? తేల్చుకోవాల‌ని స‌వాల్ విసిరారు. ద‌య‌చేసి తెలుగుదేశం పార్టీని కుల‌సంఘంగా మార్చొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న తెలుగుదేశం పార్టీలోని అస‌మ్మ‌తి ఒక్క‌సారిగా బ‌ద్ద‌లైంది. విజ‌య‌వాడ టీడీపీ నేత‌లు బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, బుద్ధా వెంక‌న్న‌, నాగుల్‌మీరా సంయుక్తంగా తిరుగుబావుటా ఎగ‌రేశారు. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌పై త‌మ‌కు క‌నీసం స‌మాచారం కూడా ఇవ్వ‌లేద‌ని, రూట్‌మ్యాప్ మార్చ‌డానికి కేశినేని ఎవ‌ర‌ని ప్ర‌శ్నించారు. కేశినేని త‌మ అధిష్టానం కాద‌ని, మాచ‌ర్ల ఘ‌ట‌న‌లో పార్టీకోసం ప్రాణాలు ప‌ణంగా పెట్టామ‌ని, అత‌నిలా చీక‌టి వ్యాపారాలు, చీక‌టి ఒప్పందాలు లేవ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ద‌మ్ముంటే కేశినేని ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెల‌వాల‌ని, బీసీలంతా ఆయ‌న చెప్పుచేత‌ల్లో బ‌త‌కాలా? అని ప్ర‌శ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: