తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాసం సందర్భంగా బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పల్లెలు పట్టణాల్లో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలోనూ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా బోనాల సందర్భంగా మద్యం దుకాణాలను మూసి వేయాలని ప్రభుత్వ నిర్ణయించుకుంది. ఈరోజు రేపు హైదరాబాద్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలను మూసి వేస్తున్నారు.

ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు బోనాల సందర్భంగా మద్యం దుకాణాలను బంద్ చేస్తారు. మద్యం దుకాణాల తో పాటు కల్లు కాంపౌండ్ లు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా మూసివేస్తున్నట్టు ఆబ్కారి శాఖ ప్రకటన విడుదల చేసింది. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని మద్యం దుకాణాలను బంద్ చేస్తున్నట్టు ప్రకటించింది.ఇది ఇలా ఉండగా మద్యం దుకాణాలు మూసివేస్తారు అని తెలిసిన మందుబాబులు ముందు రోజే భారీగా మద్యం కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకుంటారు. న్యూ ఇయర్ ఇతర వేడుకల సమయంలోనూ ఇదే తీరు కనిపిస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: