సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇప్పుడు హిందూపురం పర్యటనకు వెళ్ళారు. అక్కడ వరుసగా పార్టీ నాయకులతో సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. నిన్న టీడీపీ రాయలసీమ సదస్సు జరిగింది. ఈ సమావేశానికి హాజరైన బాలకృష్ణ... పలు కీలక కామెంట్స్ కూడా చేసారు. ఇక హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు చేసారు.

ఈ సందర్భంగా ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసుకున్న బాలకృష్ణ... వైద్య సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసిన చేస్తూ వైద్యుల తీరుని తీవ్రంగా తప్పుబట్టారు. సరైన వైద్యం అందట్లేదని రోగుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. జిల్లా ప్రభుత్వాస్పత్రిలోనే ఇంత అధ్వానంగా పరిస్థితులు ఉన్నాయి  అని బాలయ్య ఫైర్ అయ్యారు. ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితులపై కలెక్టర్‍కు ఫిర్యాదు చేస్తా అని డాక్టర్ లకు  ఎమ్మెల్యే బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap