వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన బాధితుల్లో భరోసా నింపలేకపోయిందంటోంది జనసేన. ముందుగా ఎంపిక చేసిన వారితోనే ముఖ్యమంత్రి మాట్లాడారని జనసేన పిఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  విమర్శించారు. వేరే వాళ్ల నుంచి కనీసం వినతి పత్రాలు కూడా తీసుకోలేని స్థితిలో సీఎం ఉన్నారని జనసేన పిఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  వ్యాఖ్యానించారు. వరద బాధితుల సమస్యలపై జనసేన నేతలు వినతి పత్రం ఇవ్వాలనుకుంటే వారిని గృహనిర్భదం చేశారని జనసేన పిఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  అన్నారు.


వరద బాధితులకు ఏం సాయం చేశారో చెప్పకుండా విపక్షాలను విమర్శించటానికే ముఖ్యమంత్రి పరిమితమయ్యారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వరద నష్టంపై ఇతర రాష్ట్రాల్లో అధికారులు ప్రాథమిక అంచనా వేసి కేంద్రానికి నివేదిక సమర్పించి తక్షణ సాయం కోరుతుంటే  మన రాష్ట్రంలో మాత్రం ఇంకా ప్రమాద హెచ్చరికలు ఉన్నాయని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. వరదలు రాగానే రెవెన్యూ అధికారులు నష్టంపై ప్రాథమిక అంచనా వేసి, నివేదికను కేంద్రానికి పంపించాలన్న నాదెండ్ల మనోహర్  కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి అంచనా వేసి నిధులు విడుదల చేసేదని తెలపారు. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం తూతూ మంత్రంగా పనిచేస్తోందని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: