ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మరో పన్నాగం పన్నుతున్నట్లు తెలుస్తోంది. భారత్ పై మరోసారి దాడి చేయనున్నట్లు సమాచారం. భారత సైనికులు ప్రయాణించే రైళ్లను టార్గెట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మిలిటరీ రైళ్లపైనే పాకిస్తాన్ పూర్తి నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో రైల్వే శాఖ అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అలాగే భద్రత కోసం ఉద్యోగులకు అడ్వైజరీని కూడా జారీ చేసింది.
ఇక పాక్ పై జరుగుతున్న దాడులకు పాకిస్తాన్ ప్రధాని షహబాబ్ షరీఫ్ స్పందించారు. పాకిస్తాన్ భారత్ పై చర్యలు కచ్చితంగా తీసుకుంటుందని తెలిపారు. భారతదేశం పాకిస్తాన్ కి ఎప్పుడు శత్రువేనని అన్నారు. పాకిస్తాన్ భారత్ ని వదిలిపెట్టదని కచ్చితంగా బదులు తీర్చుకుంటుందని పాక్ ప్రధాని చెప్పుకొచ్చారు. పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడి ఉందని వెల్లడించారు.