దేశీ అతిపెద్ద బ్యాంక్ ఐనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు వివిధ రకాల సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. రుణలు, డిపాజిట్లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం క్యాష్ విత్‌డ్రా, చెక్ బుక్ వంటి పలు సర్వీసులు ఎస్‌బీఐ అందిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఎస్‌బీఐ త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు ఓ హెచ్చ‌రిక జారి చేసింది. బ్యాంక్ కస్టమర్లు కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుసుకోవాలని స్టేట్ బ్యాంక్ తెలిపింది. దీనికి సంబంధించి పబ్లిక్ నోటీస్ కూడా జారీ చేసింది.

 

నాన్ కేవైసీ బ్యాంక్ అకౌంట్లు పనిచేయకపోవచ్చని, స్తంభింపజేస్తామని స్టేట్ బ్యాంక్ తెలిపింది. ఇక కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకొని బ్యాంకింగ్ సర్వీసులును ఎలాంటి ఆటంకం లేకుండా పొందాలని సూచించింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. బ్యాంకులు కస్టమర్ల కేవైసీ వివరాలను అప్‌డేట్ చేస్తూ రావాలి. బ్యాంకులు క్రమానుగతంగా కస్టమర్ల కేవైసీ వివరాలు  అప్పుడప్పుడు అప్‌డేట్ చేయాలి. ఒకవేళ కస్టమర్ల కేవైసీ పెండింగ్‌లో ఉంటే అప్పుడు వారికి అలర్ట్ పంపించాల్సి ఉంటుంది.

 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవైసీ అప్‌డేట్ కోసం కస్టమర్లకు గడువు నిర్దేశించింది. ఫిబ్రవరి 28లోగా అవసరమైన డాక్యుమెంట్లు అందజేసి కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి బ్యాంక్ తెలిపింది. సో.. బ్యాంక్ నుంచి కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని అలర్ట్ పొందిన వారు వెంటనే ఆ పని పూర్తి చేసుకోవాలి. కాగా, ఇటీవల కాలంలో బ్యాంకులు తమ కస్టమర్ల కేవైసీ అప్‌డేట్‌కు చాలా ప్రాధాన్యం ఇస్తున్నాయి. బ్యాంకులు కస్టమర్ కేవైసీ నిబంధనలు అతిక్రమిస్తే ఆర్‌బీఐ వీటికి భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: