దేశంలో పండుగల సీజన్ ప్రారంభం అయ్యింది. సాధారణంగా ఈ సీజన్ లో అనేక సంస్థలు వివిధ ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తుంటాయి. ఈ వరుసలో ఈ కామర్స్ సంస్థల కు ప్రత్యేక స్థానం ఉంది. వీళ్లు ప్రతి పండుగకు సరికొత్త స్టాక్ తో కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ సీజన్ లో మొబైల్స్ వంటి గాడ్జెట్ లకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. ఈ వరుసలో అమెజాన్ ఇప్పటికే కొత్త ఆఫర్లతో సిద్ధమైంది. ఇక ఫ్లిప్ కార్ట్ కూడా తాజాగా బిగ్ బిలియన్ సేల్ ప్రకటించింది. అక్టోబర్ 7 నుండి 12 వరకు ఈ సేల్ ఉంటుందని తెలిపింది. అమెజాన్ తేదీలు ప్రకటించినప్పటికీ దాదాపుగా ఒకటిరెండు రోజుల తేడాతో పండుగ సీజన్ అంతా ఈ సేల్ ఉంటుంది.

ఆయా సంస్థల సీజనల్ ఆఫర్ సేల్ లో వివిధ మొబైల్ ఉత్పాదక సంస్థలు కూడా తమ సరికొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తుంటాయి. ఈ సీజన్ లో కూడా ఆ విధంగా బోలెడు మోడల్స్ సిద్ధంగా ఉన్నాయి. సేల్ మొదలు కాగానే కొనేసుకోవడమే. సెప్టెంబర్ 24న రియల్ మీ నార్జ్హో 50, 50ఏ, 50 ప్రో ను విడుదల చేస్తుంది. సెప్టెంబర్ 27న ఒప్పో ఏ55; సెప్టెంబర్ 28న శాంసంగ్ గాలక్సీ ఎం52 5జి; సెప్టెంబర్ 29 స్మార్ట్ ఫోన్; షావోమి లైట్ 11 5జి; సెప్టెంబర్ 30న పోకో; వివో లు స్మార్ట్ ఫోన్ లు విడుదల చేస్తున్నాయి. అలాగే అక్టోబర్ 1న మోటరోలా స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తుంది.  

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్ పేజీ ద్వారా రివీల్ కేలండర్ లో ఈ సరికొత్త ఫోన్ ల వివరాలు, ధరలు తెలుసుకోవచ్చు. శాంసంగ్ సెప్టెంబర్ 28 మధ్యాహ్నం 12 గంటలకు తన కొత్త వేరియెంట్ ను లాంచ్ చేయనుంది. గెలాక్సీ మోడల్ అమెజాన్ ద్వారా సేల్ చేస్తున్నారు. ఒప్పో ఏ55 ని సెప్టెంబర్ 27 ల విడుదల చేయనుంది. పోకో, వివో సంస్థలు కూడా 30న తమ మొబైల్ లను లాంచ్ చేస్తున్నాయి. ఇవన్నీ ఫ్లిప్ కార్ట్ పండుగ సేల్ బిగ్ బిలియన్ సేల్ ద్వారా అమ్మకానికి పెట్టనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: