బంగాళాదుంప అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాక అందరు ఇష్టంగా తింటూ ఉంటారు.మరి అలాంటి బంగాళాదుంప లో క్యాబేజి కాంబినేషన్ వేసి వండితే ఇంకెంత రుచిగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అందుకే ఈరోజు ఇండియా హెరాల్డ్ వారు ఆలూ క్యాబేజి కర్రీ ఎలా తయారు చేయాలో మీకు వివరించబోతున్నారు. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామా. !
 
కావలిసిన పదార్ధాలు :

అరకేజి క్యాబేజి

3 బంగాళ దుంపలు

1 ఉల్లి పాయ

3 పచ్చి మిర్చి

అర టీ స్పూన్ కారం

తగినంత ఉప్పు

చిటికెడు పసుపు

టేబుల్ స్పూన్ ఆవాలు

జీలకర్ర టేబుల్ స్పున్

మినప్పు టేబుల్ స్పున్

శనగపప్పు టేబుల్  స్పున్

2 రెమ్మలు కరివేపాకు

2 రెబ్బలు వెల్లుల్లి

 తయారు చేయు విధానం:

ముందుగా క్యాబేజిని కడిగి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో ముందుగా తురుముకున్న క్యాబేజి ముక్కలు,  ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు పోసి నీళ్లు అన్నీ ఇగిరిపోయి ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ముక్కలు మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఉల్లి, పచ్చిమిర్చిను ముక్కలును  కట్ చేసుకోవాలి. అలాగే బంగాళాదుంపలను కూడా పైన చెక్కుతీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో సరిపడా నూనె పోసి ఆవాలు, సాయి మినపప్పు, జీలకర్ర, శెనగపప్పు,వెల్లుల్లి రెబ్బలు,  కరివేపాకు వేసి పోపు పెట్టాలి.తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి, ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూ ముక్కలు కూడా వేసి కాసేపు వేయించాలి.తరువాత కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేయాలి. ఒక 5 నిముషాలు వేగిన తరువాత ముందుగా ఉడకబెట్టుకున్న క్యాబేజి ముక్కలు కూడా వేయాలి. తరువాత కారం వేసి సన్నని మంట మీద వేపాలి. నూనె పైకి కనిపించే వరకు పొయ్యి మీద ఉంచండి. తరువాతవా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకోవాలి. !



 


మరింత సమాచారం తెలుసుకోండి: