తల్లి ప్రేమ ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. ఎవరో చెప్పడం కాదు ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో తల్లి ప్రేమ గొప్పతనాన్ని గురించి తెలుసుకునే ఉంటారు. ఆ ప్రేమను ఆస్వాదించే ఉంటారు. అయితే ఇక పిల్లలపై తల్లి చూపించే ప్రేమ ముందు ఇక ఏదీ సాటి రాదు అనేది ఇప్పటికీ ఎన్నోసార్లు నిరూపితమైంది. తన ప్రాణాలు పోతున్న కూడా పిల్లల ప్రాణాలు కాపాడాలని తల్లి ఎప్పుడు ప్రయత్నిస్తుంది అని సినిమాల్లోనే కాదు  నిజ జీవితంలో కూడా ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. అయితే ఇక్కడ తల్లి ప్రేమ ఎంత గొప్పది అన్న దానికి నిదర్శనంగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఉగ్రవాదులు ఎంత కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 ఏకంగా ప్రజల ప్రాణాలకు అసలు విలువ ఇవ్వరు ఉగ్రవాదులు. ఈ క్రమంలోనే ఎవరైనా తమను పట్టుకునేందుకు ప్రయత్నిస్తే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. వెనకా ముందు ఆలోచించకుండా ఇక చేతిలో ఉన్న తుపాకీకి పని చెబుతూ ఉంటారు. ఇక సొంత కుటుంబాన్ని కూడా కాల్చేయడానికి వెనకాడరు. కానీ ఇక్కడ మాత్రం తల్లి ప్రేమ ఏకంగా ఉగ్రవాదిని కదిలించింది. జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులకు విజ్ఞప్తి తో ఇద్దరు ఉగ్రవాదులు ఆయుధాలు విడిచి పోలీసుల ముందు లొంగిపోయారు.


 ఇటీవలే కుల్గాం జిల్లాలో భారత భద్రతా బలగాలు అందిన సమాచారం ప్రకారం యాంటీ టెర్రర్ ఆపరేషన్ లో ఒక ఇంట్లో ఇద్దరు ముష్కరులు అని గుర్తించారు. ఈ క్రమంలోనే వారి తల్లిదండ్రులను అక్కడికి తీసుకు వెళ్లి ఉగ్రవాదులు లొంగిపోయే చేసేందుకు ప్రయత్నించగా.. తల్లిదండ్రులు బ్రతిమిలాడడం తో ఆయుధాలు వదిలేసి ఉగ్రవాదులు లొంగిపోయారు.  వారి నుంచి ఆయుధాలతో పాటు భారీగా మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. లొంగిపోయిన ఇద్దరు అధికారులు  కూడా ఇటీవలే ఉగ్రవాద సంస్థలు చేరినట్లు పోలీసులు గుర్తించారు.  అంతే కాకుండా ఆ ప్రాంతాల్లో ఇంకా ఉగ్రవాదుల జాడ ఉందని మరికొన్ని ఆపరేషన్స్ చేపడతామని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: