ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే మాత్రం మనిషి ఆలోచన తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడి ఎదుర్కొనే వాడు మనిషి. కానీ నేటి రోజుల్లో వెలుగులోకి వచ్చిన ఘటనలు చూసిన తర్వాత మాత్రం మనిషిలో సమస్యలను ఎదుర్కొనే ధైర్యం పూర్తిగా కనుమరుగయింది అన్నది తెలుస్తూ ఉంది. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. చిన్న కష్టం వస్తే చాలు ఇక అక్కడితో జీవితం ముగిసిపోయింది అని భావిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న వారు నేటి రోజుల్లో కోకోళ్లలు అని చెప్పాలి.


 ముఖ్యంగా విద్యార్థులు అయితే క్షణికావేషంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఏకంగా పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరని  శోఖాన్ని మిగులుస్తూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తమ పిల్లలు బాగా చదువుకుంటారని.. ప్రయోజకులు అవతారని తల్లిదండ్రులు నమ్మకం పెట్టుకుంటే.. అటు ఎంతో మంది విద్యార్థులు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది.


 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల లో అడవుల్లో పురుగుమందు తాగి ఓ యువకుడు చనిపోయిన ఘటన వెలుగు చూసింది. చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే 21 యువకుడు తోర్నాల బీసీ హాస్టల్ లో ఉంటూ సిద్దిపేట డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే చదువుపై శ్రద్ధ చూపాలని తండ్రి ఇటీవల శ్రీకాంత్ ని కాస్త మందులించాడు. దీంతో ఎంతో మనస్తాపం చెందాడు శ్రీకాంత్. చివరికి ఆత్మహత్య చేసుకోవాలని కఠిన నిర్ణయం తీసుకొని ఏడుపాయల అడవుల్లో పురుగుల మందు తాగి చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: