ఇటీవల కాలంలో మహిళలకు ఎక్కడ రక్షణ లేదు అని నిరూపించేందుకు ప్రతిరోజు ఎన్నో రకాల ఘటనలు వెలుగులోకి  వస్తూనే ఉన్నాయి. మహిళ ఇల్లు దాటి కాలు బయటపెట్టింది అంటే చాలు కామపు కోరల నుంచి తప్పించుకుంటూనే ప్రతి అడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఇక ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అటు మహిళలకు  వేధింపులు మాత్రం తగ్గడం లేదు అని చెప్పాలి. ఇక కొంతమంది అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరిని వదలకుండా దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అయితే అటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినప్పటికీ కామాంధుల తీరులో మాత్రం ఎక్కడా మార్పు రావడం లేదు. వెరసి ఇక ఆడపిల్లలుగా పుట్టడమే పాపమా అని ప్రతి మహిళ కూడా బాధపడే పరిస్థితి నేటి సభ్య సమాజంలో నెలకొంది అని చెప్పాలి.  ఇక ఇక్కడ జరిగిన ఘటన అయితే మరింత దారుణమైనది అని చెప్పాలి. ఏకంగా 90 ఏళ్ల వృద్ధురాలని కూడా వదలకుండా ఓ కామాంధుడు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.


 ఈ ఘటన మధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. షాడోల్ జిల్లాలో సభ్యసమాత్రం తలదించుకునే ఈ ఘటన జరిగింది. తన బంధువుల ఇంటికి వెళుతున్న వృద్ధురాలికి బైక్ పై వెళ్తున్న ఒక వ్యక్తి లిఫ్ట్ ఇస్తాను అంటూ మంచి వాడిలా మాట్లాడి చివరికి వాహనంపై ఎక్కించుకున్నాడు. ఇక ఆ తర్వాత మార్గమధ్యమంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి ఇక 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే వృద్ధురాలి కుటుంబ సభ్యులకు విషయం చెప్పగా.. ఇక వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: