
ఇలాంటి సమయంలో కొంతమంది ఖాకి చొక్కా వేసుకున్నాం.. ఇక మాకంటే మించిన వారు ఎవరూ లేరు అనుకుంటున్నారో ఏమో.. ఇక నిర్దాక్షిణ్యంగా జనాలపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇటీవలే ఇలాంటిదే జరిగింది. అతను ఒక ఉపాధ్యాయుడు దాదాపు 70 ఏళ్లు ఉంటాయి. 40 ఏళ్ల వరకు పాఠాలు బోధించి ఎంతో మంది భావి భారత పౌరులను తీర్చిదిద్దాడు. అయితే ఇటీవల రోడ్డుపై సైకిల్ తొక్కుకుంటూ వెళ్తూ ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఇలా కిందపడిన సమయంలో పక్కన ఎవరైనా పోలీసులు ఉంటే అయ్యో పెద్దాయన కిందపడ్డాడు అని సహాయం చేసి పైకి లేపి ఇక గాయాలు ఏమైనా అయ్యాయేమో అని చూస్తారు.
కానీ బీహార్ లోని కైమూరులో మాత్రం పోలీసులు ఇలా చేయలేదు. నవల కిషోర్ పాండే అనే ఉపాధ్యాయుడు సైకిల్‌పై వెళ్తుండగా కిందపడ్డాడు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ఈ లోగా అక్కడికి చేరుకున్న ఇద్దరు మహిళ పోలీసులు హారన్ మోగిస్తూ సైకిల్ పక్కకు తీయాలని కోరారు. అయితే వృద్ధుడు కావడంతో వెంటనే సైకిల్ పక్కకు తీయలేకపోయాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన పోలీసులు విచక్షణ రహితంగా లాఠీలతో అతనిపై దాడికి దిగారు. నన్ను వదిలేయండి అంటూ ఎంత ప్రాధేయపడిన కనీస జాలి చూపలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది. ఇకఇద్దరు కానిస్టేబుల్స్ పై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఉన్నతాధికారులు.