ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఎగ్ ఆమ్లెట్స్ అంటే ఇష్టపడని మాంసాహారి ఉండరు. ఎంతో రుచికరంగా ఉంటాయి. ఎగ్ ఆమ్లెట్ ని అన్నం తినేటప్పుడు నంచుకొని తింటుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇక ఈ రుచికరమైన ఎగ్ ఆమ్లెట్ తో రుచికరమైన ఎగ్ కర్రీని కూడా చేసుకోవచ్చు. ఇక స్పీసీ ఎగ్ ఆమ్లెట్ కర్రీని ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...
  
ఎగ్ ఆమ్లెట్ కర్రీకి కావాల్సిన పదార్ధాలు...

గుడ్లు - నాలుగు,
టొమాటో ప్యూరీ - రెండు కప్పులు,
ఉల్లితరుగు - ఒక కప్పు,
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టీ స్పూనులు,
కొత్తిమీర తురుముు - ఒక టీస్పూను,
శెనగపిండి - రెండు టీస్పూనులు,
గరం మసాలా - ఒక టీస్పూను,
కొబ్బరిపాలు - ఒక కప్పు,
కారం - ఒక టీస్పూను,
పసుపు - చిటికెడు,
జీలకర్ర - ఒక టీస్పూను,
నూనె - తగినంత,
ఉప్పు - రుచికి సరిపడా

ఎగ్ ఆమ్లెట్ కర్రీ తయారు చేయు విధానం...

ముందుగా నాలుగు గుడ్ల సొనను ఒక గిన్నెలో వేయాలి. అందులో కాస్త సెనగపిండి, కొత్తిమీర తురుము, కాస్త ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు పెనం మీద ఆ మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా వేసి మూతపెట్టాలి. అరఅంగుళం మందంలో ఆమ్లెట్ తయారవుతుంది. అది చల్లారాక ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి స్టవ్ మీద పెట్టి కాస్త నూనె వేయాలి. అందులో జీలకర్ర, ఉల్లి ముద్ద వేసి వేయించాలి అది వేగాక టోమాటో గుజ్జు, అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి. అవి బాగా వేగాక కొబ్బరి పాలు వేసి వేయించాలి. తరువాత కప్పు నీళ్లు వేయాలి. కాసేపు మరిగాక కారం, పసుపు, గరంమసాలా, ఉప్పు వేసి కలపాలి. ఆ మిశ్రమం బాగా మరిగాక... ఆమ్లెట్ ముక్కలు వేసి ఉడికంచాలి. ముక్కలు వేశాక ఓ ఏడు నిమిషాల పాటూ మరిగించి స్టవ్ ఆపేయాలి.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: