ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి మనం చాలా కేర్ తీసుకుంటాం. వాళ్లకి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి మనం మంచి ఆహారం తయారు చెయ్యాలి. పిల్లలకి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తినిపించడం అలవాటు చెయ్యకండి..వాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి రుచికరమైన క్యారెట్ బీన్స్ రైస్ ని తయారు చెయ్యండి. ఇక రుచికరమైన క్యారెట్ బీన్స్ రైస్ ని  ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి..

క్యారెట్ బీన్స్ రైస్ కి కావాల్సిన పదార్ధాలు..

అన్నం - కప్పు, క్యారెట్‌, బీన్స్‌ ముక్కలు - రెండూ కలిపి పావుకప్పు, చిక్కుడుకాయలు - రెండు, క్యాప్సికం, వంకాయ, బంగాళాదుంప - ఒక్కోటి చొప్పున, బెండకాయలు - రెండు, పచ్చిబఠాణీ - రెండు చెంచాలు, యాలకులు - మూడు, జాజికాయపొడి - అరచెంచా, జాపత్రి పొడి - పావుచెంచా,లవంగాలు - నాలుగు, దాల్చిన చెక్క - చిన్న ముక్క, నెయ్యి - పావుకప్పు, ఉప్పు - తగినంత, కరివేపాకు రెబ్బలు - రెండు.

క్యారెట్ బీన్స్ రైస్ తయారు చేయు విధానం...

ముందుగా కావాల్సిన  పదార్థాలలో కూరగాయలన్నింటినీ చిన్న ముక్కలుగా కోసుకుని కాసేపు ఉడికించాలి. కాస్త మెత్తగా అయ్యాక స్టవ్ కట్టేయాలి. అలా అని మరీ పేస్టులా కాదు. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త నెయ్యి వేయాలి. అందులో అన్ని మసాలా దినుసులు వేసి వేయించాలి. అవి వేగాక కాస్త కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు అందులో ఉడికించిన కూరగాయల ముక్కలన్నీ వేసి బాగా వేపాలి. అవి వేగాక అన్నం, తగినంత ఉప్పు వేసి వేయించాలి. అంతే పిల్లల కోసం క్యారెటన్ బీన్స్ రైస్ రెడీ.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: