
కావలిసిన పదర్ధాలు :
కోడిగుడ్డు-4 ఉడకబెట్టినవి
ఉల్లిపాయలు-1
బెండకాయలు లేతవి -1/2 kg
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
ఉప్పు -సరిపడా
కారం-సరిపడా
పసుపు-సరిపడా
ధనియాల పొడి -1 టీ స్పూన్
చింతపండు పులుసు -కొద్దిగా
కరివేపాకు -కొద్దిగా
ఆవాలు -1 స్పూన్
జీలకర్ర -1 స్పూన్
సాయి మినపప్పు -1 స్పూన్
కొత్తిమీర -కొద్దిగా
తయారుచేయు విధానం:
ముందుగా బెండకాయలను శుభ్రంగా కడుక్కొని రెండు ముక్కలుగా కోసుకోవాలి. ఫ్రై మాదిరిగా చిన్న చిన్న ముక్కలు కోయకూడదు. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కోసుకుని పక్కన పెట్టుకొండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేయండి ఇప్పుడు తాలింపు కోసం ఉంచుకున్న ఆవాలు, జీలకర్ర,సాయి మినపప్పు, కరివేపాకు వేసి తాలింపుని బాగా వేపండి. తాలింపు వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేపాలి. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే దాక వేపాలి. ఒక రెండు నిముషాలు అయ్యాక బెండకాయ ముక్కలను కూడా వేసి ఒకసారి గరిటెతో తిప్పండి.