ఈ భూమి మీద ఎంతో విశ్వాసంతో ఉండే జంతువులు ఏవి అంటే ప్రతి  ఒకరు చెప్పేది కుక్కల పేరు. శునకాలు ఎన్నో ఏళ్ల నుంచి విశ్వాసానికి మారుపేరు గా మారిపోయాయి.  కాస్త ఆహారం పెట్టి కొంచెం ప్రేమ చూపిస్తే చాలు ఇక జీవితాంతం కూడా విశ్వాసం గానే ఉంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నేటి రోజుల్లో ఇక కుక్కల ని పెంచుకోవడం అనేది ఒకటి ట్రెండ్  గా మారిపోయింది. వేల రూపాయలు ఖర్చు పెట్టి హైబ్రిడ్ శునకాలను తెప్పించుకొని మరీ పెంచుకుంటున్నారు ఎంతోమంది.  అంతేకాదు మనుషుల కంటే ప్రేమగా కుక్కలను చూసుకుంటున్న వారు కూడా ఉన్నారు.


 ఇదేమిటని అడిగితే నేటి రోజుల్లో కుళ్లు కుతంత్రాలతో నిండిపోయిన మనుషుల కంటే ఎంతో  విశ్వాసం తో ఉండే ఈ శునకాలు ఎంతో బెటర్ అంటూ జంతు ప్రేమికులు  సమాధానం కూడా చెబుతూ ఉంటారు. అయితే ఇలా ఏకంగా సొంత మనిషిలా చూసుకునే పెంపుడు కుక్క చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో యానిమల్స్ లవర్స్ మాటల్లో  కూడా వర్ణించ లేరు అన్న విషయం తెలిసిందే. సాధారణంగా తమ పెంపుడు కుక్కకు చిన్న కష్టం వస్తే అల్లాడిపోతూ ఉంటారు.  అలాంటిది ఇక పెంపుడు కుక్క చనిపోతే ఎన్నో రోజుల పాటు డిప్రెషన్ లో ఉండి పోతూ ఉంటారు. ఇక్కడ ఒక యువకుడు మాత్రం పెంపుడు కుక్క అనారోగ్యం భారిన పడటంతో ఆత్మహత్య చేసుకున్నాడు.


 ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ ఆల్వాల్ లో వెలుగులోకి వచ్చింది అనే చెప్పాలి. రీట్రీట్ కాలనీలో ఉండే లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి  నివసిస్తున్నాడు. అతనికి  విష్ణు నారాయణ అనే 20 ఏళ్ళ కొడుకు ఉన్నాడు.అతను  బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండగా ప్రేమగా ఒక కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే ఇటీవల అనారోగ్యం బారిన పడిన ఎంతో వీక్ అయింది.  దీంతో  కుక్క  ఆరోగ్యంపై బెంగతో ఎంతగానో వేదనకు గురయ్యాడు.  చివరికి కుక్క చనిపోయింది. బాధతోరెండుసార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు. ఇక ఇటీవలే ఇంట్లో ఎవరూ లేని సమయంలో  ఉరి వేసుకొని చివరికి ప్రాణాలు వదిలాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: