ప్రపంచం మొత్తం ప్రస్తుతం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్న సమయంలో ఇంకా మూఢనమ్మకాల మాయలో మునిగిపోతున్న జనాలు అక్కడక్కడ తారస పడుతూనే ఉన్నారు  నేటి రోజుల్లో కూడా మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అనే నమ్మకంతో కారణంగా మనుషులు దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. క్షుద్ర పూజలు చేయడం ద్వారా గుప్త నిధులను వెలికి తీయవచ్చు అని భావిస్తూ ఎంతోమంది దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇక ఇలా గుప్త నిధులతో ధనవంతులు అవ్వాలి అనే దురుద్దేశంతో క్షుద్ర పూజల కోసం నర బలులు ఇస్తున్న ఘటనలు కూడా సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.


 ఇలా నేటి టెక్నాలజీ యుగంలో కూడా మూఢనమ్మకాలకు ప్రాబల్యం ఉంది అని నిరూపిస్తున్న ఘటనలు కోకోల్లలు అని చెప్పాలీ. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. క్షుద్ర పూజలు చేసి ఎలాగైనా గుప్త నిధులు దక్కించుకోవాలని నిర్ణయించుకున్నారు కొంతమంది వ్యక్తులు. ఎవరికి అనుమానం రాకుండా రహస్యంగా క్షుద్ర పూజలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక ఇలాంటి సమయంలోనే అటువైపుగా ఒక బాలుడు రావడం గమనించి చివరికి దారుణానికి పాల్పడ్డారు. ఏకంగా బాలుడిని దారుణంగా నరబలి ఇచ్చేశారు.


 ఈ ఘటన ఎక్కడో కాదు దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. బీహార్ కు చెందిన అజయ్, అమర్ అనే ఇద్దరు కూడా భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు అని చెప్పాలి. ఢిల్లీలోని లోది కాలనీలో ఉంటున్నారు. అయితే డబ్బు మీద వారికి అత్యాశ కలిగింది. ఈ క్రమంలోనే తమ గుడిసెలో మూఢనమ్మకాల మాయలో క్షుద్ర పూజలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే అటువైపుగా ఒక బాలుడు రావడం గమనించారు. ఈ క్రమంలోనే బాలుడిని బలవంతంగా క్షుద్ర పూజలు జరుగుతున్న ప్రాంతానికి తీసుకువెళ్లి దారుణంగా గొంతు కోసినరబలి ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: