
ఇక ఆస్ట్రేలియాలోనూ ఇలాంటి ఓ దారుణమే వెలుగు చూసింది. విక్టోరియా రాష్ట్రంలో వాల్ఫ్యూస్ అనే చిన్న పట్టణంలో నోయల్ పెయిన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతని భార్య పేరు రెబెక్క నోయల్. అయితే నోయల్ భార్యను తరచూ వేధింపులకు పాల్పడుతూ ఉండేవాడు. కొట్టడం తిట్టడం బలవంతంగా కోరికలు తీర్చుకోవడం చేసేవాడు. ఇలా భర్తతో రోజు నరకం చూసేది. అయితే కొన్నాళ్ళకి ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి ఈమె నా గర్ల్ ఫ్రెండ్ ఇప్పటినుంచి ఇంట్లోనే ఉంటుంది అంటూ భార్యకు చెప్పాడు. అయినా రెబక్కా ఏమీ అనలేదు.
ఆ తర్వాత కొన్ని రోజులకే భార్యతో పాటు మరో మహిళను కూడా హింసిస్తూ అత్యాచారం చేయడం మొదలుపెట్టాడు. ఇలాంటి సమయంలోనే భార్యకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే నిద్ర మాత్రలు తీసుకొచ్చి వాటిని ఐసింగ్ షుగర్ లా మార్చి దాంతో బిస్కెట్లు తయారు చేసింది. ఇక ఆ బిస్కెట్లను భర్తకు అందించింది. వాటిని అతను తిన్నాడు. మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో భయపడిపోయిన రెబెక్క అతని మృతదేహాన్ని ఫ్రిజ్లో దాచి పెట్టింది. అయితే ఇక ఈ కేసును చేదించడం పోలీసులకు సవాల్ గా మారింది. నిద్ర మాత్రలు కలిపిన బిస్కెట్లు తిని చనిపోయాడా లేకపోతే ఫ్రిజ్లో ఉంచడం వల్ల చనిపోయాడా అన్నది పోలీసులు తేల్చలేకపోయారు. ఈ కేసు కోర్టులో విచారణ కొనసాగుతుంది.