
తన కడుపున పుట్టిన పిల్లలకు ఏ కష్టం రాకుండా ఎంతో సంతోషంగా చూసుకుంటుంది. అంతేకాదు పిల్లలకు ఏదైనా కష్టం వస్తే అపర కాలిలా మారిపోయి ఏకంగా ఆ కష్టాన్ని తరిమికొడుతుంది తల్లి. ఇక పిల్లల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడుతుంది అని చెప్పాలి. అయితే తల్లి ప్రేమ ఎంత గొప్పది అని నిరూపించే ఘటనలు ఇప్పటివరకు సోషల్ మీడియాలో చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిసిన తర్వాత మాత్రం తల్లి ప్రేమను మించింది ఇంకేదీ లేదు అనే భావన మరోసారి ప్రతి ఒకరికి కలుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే పిల్లల కోసం ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదు ఆ ఇద్దరు తల్లులు.
నెల్లూరు జిల్లాలోని భగత్ సింగ్ కాలనీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. గుంతలో పడిన పిల్లల్ని రక్షించి ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. పెన్నా నది క్రెడిట్మెంట్ వాల్ నిర్మాణం కోసం తవ్విన గుంతలో ఇద్దరు చిన్నారులు పడిపోగా వారి తల్లులు షాహినా, శబిన గుంతలోకి దూకి పిల్లలను కాపాడారు. కానీ తర్వాత వారిద్దరు గుంతలో నుంచి పైకి రాలేకపోయారు. బురదలో చిక్కుకొని చివరికి ప్రాణాలు కోల్పోయారు . ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.