ప్రస్తుతం టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. మనిషి జీవనశైలిలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఇలాంటి మార్పులు ఒక మనిషి జీవన విధానాన్ని ఎంతో సులభతరం చేశాయి అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో ఒక ప్రయాణాలు చేయడం  ఎంతో సులభంగా మారిపోయింది. ఒకప్పుడు సొంత వాహనం ఉంటేనో లేదంటే ఆర్టీసీ బస్సుల్లోను ఇక ప్రయాణం సాగించేవారు. అయితే సామాన్య ప్రజలందరూ కూడా సొంత వాహనం కొనుగోలు చేయాలని కలలు కనేవారు.


 కానీ ప్రస్తుతం ఏకంగా సొంత వాహనం లేకపోయినా పరవాలేదు ఎక్కడికైనా వెళ్లాలి అనుకుంటే నిమిషాల వ్యవధిలో ముందుకు వచ్చి వాలిపోయే క్యాబ్ సర్వీసులు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆటో, బైక్, కారు, ఇలా తమకు కావలసిన ప్రతి ఒకటి కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటూ ప్రయాణాలను సాగిస్తూ ఉన్నారు అందరూ. అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం ఇలా క్యాబ్ ల ద్వారా ప్రయాణం చేసిన వారికి ఊహించని రీతిలో చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే.


 ఒక వ్యక్తి ఊబర్లో క్యాబ్ ఆర్డర్ చేసుకొని ప్రయాణాన్ని సాగించాడు. ఉబర్లో చాలామంది ప్రయాణం చేస్తారు అందులో కొత్త ఏముంది అనుకుంటున్నారు కదా. అతనికి ఇలా ప్రయాణం చేసినందుకు కోటి రూపాయల బిల్లు వచ్చింది. నోయిడాలోని ఒక వ్యక్తి ఉబర్ ఆటో బుక్ చేయగా.. ఏడు కోట్ల బిల్లు వచ్చిన విషయం తెలిసి ఒకసారిగా అవాక్కయ్యాడు. ఇటీవల హైదరాబాద్కు చెందిన వ్యక్తికి సైతం బెంగళూరులో ఇలాంటి అనుభవం ఎదురయింది. ఉబర్లో ఆటో బుక్ చేయగా 250 రూపాయలు వస్తుందనుకుంటే.. రూ. కోటి వచ్చేసరికి షాక్ అయ్యాడు. అయితే ఇది సాంకేతిక లోపం వల్ల జరిగినప్పటికీ డ్రైవర్ తో పాటు తనను కూడా ఆందోళనకు గురి చేసినట్లు సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: