తెలంగాణలో పోలింగ్ జరుగుతోంది. ఇప్పుడు నాయకులంతా పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ లు గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో సీమాంధ్ర ఓటర్లు ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఆ ఓటర్లంతా ఎటు వైపు చూస్తారనేదే ప్రస్తుతం ఆసక్తిగా మారింది.


గ్రేటర్ హైదరాబాద్ లోని 24 నియోజకవర్గాల్లో గెలుపోటమలును శాసించే స్థాయి సీమాంధ్ర ప్రజలకు ఉంది. వారు ఎటుక వైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే గెలిచే అవకాశం ఉంది. ప్రతి నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లు రాయలసీమ, ఆంధ్రా ప్రజలే ఉన్నారు. ఈ సారి ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండటంతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అని ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి.


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి లోపాయికారకంగా టీడీపీ మద్దతు ప్రకటిస్తుంది. మరోవైపు కమ్మ సామాజిక వర్గ నేతలు కూడా కాంగ్రెస్ కు మద్దతుగా లేఖలు విడుదల చేశారు. అధికార పార్టీ నాయకులు పదే పదే రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఒకటే అని చెప్పడం కూడా కాంగ్రెస్ కు లాభిస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టు విషయంలో మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఆయన అరెస్టుతో తెలంగాణకు ఏం సంబంధం ఇక్కడ ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. దీంతో సీమాంధ్ర ఓటర్లు కొంత ఆగ్రహానికి గురయ్యారు.


చంద్రబాబు అరెస్టు తెలంగాణ నాయకులకు సాధారణమే అయినా టీడీపీ సానుభూతిపరులకు మాత్రం అతి పెద్ద అంశమే.  ఈ కారణం చేత కొంతమేర సీమాంధ్ర ఓటర్లు బీఆర్ఎస్ నుంచి దూరం అయ్యారు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.  సీమాంధ్ర ఓటర్లు అంటే కేవలం టీడీపీ ఓటర్లే కాదు. వైసీపీ అనుకూల వర్గం వారు కూడా ఉంటారు. వీళ్లంతా బీఆర్ఎస్ వైపు ఉంటారా అంటే అనుమానమే. ఎందుకంటే కేసీఆర్ ఏపీని పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. గత ఎన్నికలతో పోల్చితే సీమాంధ్ర ఓటు బ్యాంకు బీఆర్ఎస్ కు దూరమయ్యే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: