వైసీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలు.. ప్రారంభం అయ్యాయి. ఇవాళ,   రేపు గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా వైసీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీ నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వేదిక ప్రాంగణానికి చేరుకుని పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. సర్వమత ప్రార్ధన, వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులు అనంతరం సీఎం ప్లీనరీ ప్రారంభ ఉపన్యాసం చేశారు.


వైసీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీ మొదటి రోజు ఐదు అంశాలపై చర్చిస్తారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటన విడుదల చేస్తారు. పార్టీ జమా ఖర్చుల ఆడిట్ నివేదిక, పార్టీ నియమావళి సవరణ ప్రతిపాదనల అనంతరం వివిధ అంశాలపై చర్చ నిర్వహించే అవకాశం ఉంది. సాయంత్రం ఐదు గంటలతో తొలిరోజు ప్లీనరీ  ముగుస్తుంది. మొదటి రోజు మహిళా సాధికారత దిశ చట్టం... తీర్మానంపై మంత్రులు ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉషశ్రీ చరణ్,  రోజా , ఎమ్మెల్సీ పోతుల సునీత, లక్ష్మీపార్వతి, జక్కంపూడి విజయలక్ష్మి ప్రసంగిస్తారు.


ఇక విద్య అంశంపై మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సుధాకర్ బాబు, అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంశంపై మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, ఎమ్మెల్యేలు కొత్తగుళ్ళి భాగ్యలక్ష్మి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి ప్రసంగించే అవకాశం ఉంది. వైద్యం అంశంపై  మంత్రులు విడదల రజిని, సిదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల నాని ప్రసంగించే అవకాశం ఉంది.


ఆ తర్వాత పరిపాలనా- పారదర్శకత అంశంపై  స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పుష్ప శ్రీవాణి, పార్థసారథి ప్రసంగించే అవకాశం ఉంది. వైసీపీ అధికార పార్టీ కావడంతో ప్లీనరీ ఏర్పాట్లలో ఎక్కడా తగ్గడం లేదు. ఇటీవలే టీడీపీ  మహానాడు ఘనంగా ఒంగోలులో జరిగింది. కాబట్టి.. ఈ ప్లీనరీని టీడీపీ మహానాడుతో పోల్చుకునే అవకాశం ఉంది. అందువల్ల ఎక్కడా తగ్గకుండా ప్లీనరీ నిర్వహించాలని వైసీపీ నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. మరి  ఈ వైసీపీ ప్లీనరీ ఎవరిని మెప్పిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: