హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగింది. గతేడాది 21998 కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది 22060 కేసులు నమోదయ్యాయి. భౌతికంగా దాడుల చేసిన నేరాలు గతేడాది 2133 కేసులు. ఈ ఏడాది 2181 గా నమోదయ్యాయి. ఆస్తులకు సంబంధించిన నేరాల సంఖ్య కూడా పెరిగింది. ఈ నేరాలు గతేడాది 2417 కేసులు కాగా ఈ ఏడాది 3094 కేసులు నమోదయ్యాయి. అయితే.. మహిళలపై జరిగే నేరాల సంఖ్య గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తక్కువగా ఉంది. 2021 లో 2652 కేసులు నమోదు అయితే.. ఈ ఏడాది 2524 నమోదయ్యాయి. అలాగే చిన్నారులపై జరిగే నేరాలు గతేడాది 399. ఈ ఏడాది 350 మాత్రమే నమోదయ్యాయి.


హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాది 89 హత్యలు జరిగాయి. ఈ ఏడాది 63 కు తగ్గాయి. హత్యాయత్నాలు గతేడాది 186 కాగా ఈ ఏడాది 213 జరిగాయి. అపహరణ కేసులు 2021 లో 225 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 220 కేసులు మాత్రమే నమోదయ్యాయి. డెకాయిటీ కేసులు గతేడాది 11 నమోదు కాగా ఈ ఏడాది 8 నమోదయ్యాయి. దృష్టి మరల్చి చోరీలు గతేడాది 140 నమోదు కాగా ఈ ఏడాది 181 కేసులు నమోదయ్యాయి. వీటిలో పోలీసులు ఇప్పటి వరకూ 127 కేసులు ఛేదించారు.


ఇక మోసాలు 2021లో 1753 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 1297 కేసులు నమోదయ్యాయి. పని వాళ్ళుగా ఉండి చోరీలు చేస్తున్న కేసులు 2021 సంవంత్సరంలో 90 కేసులు నమోదైతే ఈ ఏడాది 101 కేసులు నమోదయ్యాయి వీటిలో 61 కేసులను పోలీసులు ఛేదించారు. అత్యాచారాలు గతేడాది 356 జరగగా ఈ  ఏడాది అ సంఖ్య 296 కి తగ్గింది. వేధింపుల కేసులు గతేడాది కంటే ఈ ఏడాది 218 కేసుల తగ్గాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.  అలాగే ఆస్తులకు సంబంధించిన నేరాల ఛేదనలో కూడా హైదరాబాద్ పోలీసులు  ఈ ఏడాది వృద్ది సాధించారు. మొత్తం 3094 కేసులు నమోదు కాగా వాటిలో 61 శాతం అంటే 1898 కేసులు పోలీసులు ఛేదించారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: