15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీ ట్రెజరీల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు బదిలీ చేయడంపై గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ కు ఫిర్యాదు అందింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ ఈ ఫిర్యాదు చేసింది. గ్రామ పంచాయితీల స్వయం పరిపాలన మరియు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తమ యొక్క ఫైనాన్స్ కమిషన్ ద్వారా... గ్రామాలకు నిధులను నేరుగా విడుదల చేస్తుందని  తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.


నిధులను కేంద్ర ఫైనాన్స్ కమిషన్ గత తొమ్మిది నెలలుగా విడుదల చేయకుండా... డిసెంబర్ 24న ఒకేసారి రాష్ట్రంలోని అన్ని గ్రామా పంచాయితీలకు సుమారు 3500 కోట్ల నిధులనుసగటున ఒక్కో గ్రామా పంచాయితీకి 25 లక్షల రూపాయలను నేరుగా గ్రామా పంచాయితీ ఖాతాల్లోకి బదిలీ చేసిందని తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ  నిధులను రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు గాని గ్రామా పంచాయతీలకుగాని తెలపకుండా... నేషనల్ హాలిడే అయినా డిసెంబర్ 25 వ తారీఖున అక్రమంగా దొడ్డిదారిన తమ ఖజానాలోకి బదిలీచేసుకుందని తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ సత్యనారాయణ రెడ్డి  ఫిర్యాదు చేశారు.


గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే పంచాయితీ రాజ్ వ్యవస్థలకు న్యాయబద్ధంగా రావాల్సిన మైనింగ్ సెస్... స్టాంప్ డ్యూటీ నిధులను పంచాయితీరాజ్ వ్యవస్థలకు కేటాయించకుండా తమ ఖజానాలోకి చేర్చుకుందని తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ సత్యనారాయణ రెడ్డి  గుర్తు చేశారు. ఇది చాలదన్నట్టు 2018 నూతన పంచాయితీ రాజ్ చట్టం ప్రవేశపెట్టి... దీని ద్వారా ఈ హక్కులని తీసివేసి ఈ యొక్క నిధులను ఎప్పటికి తమ యొక్క ఖజానాలోకే వచ్చేలా మలుచుకుందని తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ సత్యనారాయణ రెడ్డి  విమర్శించారు.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా ఇలానే గ్రామా పంచాయితీ నిధులని తమ ఖజానాలోకి మళ్ళిస్తుందని... ఇప్పుడు మళ్లీ అదే చేసిందని తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ సత్యనారాయణ రెడ్డి  గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా తమ ఖజానాలోకి మలుపుకుంటున్న నిధులపై విచారణ జరపాల్సిందిగా సత్యనారాయణ రెడ్డి కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR