ఢిల్లీ లిక్కర్ కుంభకోణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణలో కవిత పేరు రావడం, ఏపీలో మాగుంట కుమారుడు, మాగుంట పేరు కూడా రావడం రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. బుచ్చిబాబు అరెస్టయితే ఆయనను  తీహర్ జైలుకి పంపారు. మాగంటి కుమారుడు రాఘవ ను మిగతా నిందితులతో కలిపి విచారించాలని కోర్టు చెప్పింది. మాగుంటను కూడా రేపో మాపో అరెస్టు చేయవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఈ కథంతా నడిపించింది రాఘవే అని తేలినట్లు సమాచారం. తొలిసారి తీహర్ జైలు గడప తొక్కే పరిణామం జరుగుతోంది. కవిత, మాగుంట శ్రీనివాసులు అరెస్టు అయితే వీరిని తీహర్ జైలులో పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో తమిళనాడు లో ఇలాంటి అరెస్టులు జరిగాయి. కనిమెళి తీహర్ జైలులో ఉండటం అప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజాను కూడా అదే జైల్లో పెట్టారు. తీహర్ జైలు అయితే ఇక్కడి వారికి అంతగా తెలిసి ఉండదు.


అసలు వీరిని అరెస్ట్ చేస్తారా?  జైలు శిక్ష వేస్తారా అనే అంశం పక్కనపెడితే ప్రస్తుత పరిస్థితులను చూస్తే అలాగే కనిపిస్తోంది. మొన్నటి వరకు కవిత పార్టీ కార్యక్రమాలతో పాటు పర్సనల్ పనులు కూడా చూసుకునేది. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం కవితను జనం ముందుకు పంపిస్తోంది. ఆమె నోట మోఢీని దిక్కరించేలా మాట్లాడాలని బీఆర్ఎస్ అధిష్టానం సూచిస్తోంది. కారణం ఒక వేళ లిక్కర్ స్కాంలో అరెస్టయితే బీజేపీని, మోఢీని విమర్శించినందుకే అరెస్టులు చేశారు అని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కేసీఆర్ ఒక ప్రణాళికతో ఉన్నారని తెలుస్తోంది.


ఇది ఒకవేళ విజయవంతం అయితే బీఆర్ఎస్ కు తెలంగాణలో తిరుగుండదు. కానీ సమస్య వచ్చిందల్లా పక్క రాష్ట్రాల్లోనే బీఆర్ఎస్ ను ఎలా గెలిపించుకోవాలో ఇంకా ప్రయత్నాలు జరగడం లేదు. మోఢీని విమర్శిస్తే ఓట్లు వస్తాయా అనుకుంటే అది పొరపాటే.. మరి బీఆర్ ఎస్ నాయకులు ఎలా ముందు కెళ్లనున్నారు. లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు చేస్తారా... త్వరలోనే తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: