అనగనగా ఒక రాజ్యం..! ఆ రాజ్యానికి ఒక మహారాజు..! ఆ మహారాజుకి ఒక యువరాజు..! కాబట్టి ఆ రాజ్యానికి యువరాజే కాబోయే రాజు..! నేను ఎవరి గురించిన చెప్తున్నానో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది కదా..? అవును నేను మాట్లాడుతుంది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్), ఆయన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గురించే. అసలు ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే..

 

ఒక పక్క తెలంగాణ ప్రజలంతా కరోనా మహమ్మారి దెబ్బకి అల్లాడిపోతుంటే.. ఇంత అర్జంటుగా సచివాలయం కూల్చేసి.. కొత్తది కట్టాలనుకునే అవసరం ప్రభుత్వానికి ఏముంది..? దీనికి అధికార పార్టీ నేతలు చెప్పే సమాధానం.. పాత సచివాలయం వాస్తు బాలేదు కాబట్టి కొత్తది కట్టాలి. సరే అలానే అనుకుందాం.. మరి గడిచిన ఆరున్నరేళ్లుగా కేసీఆర్ పాలించింది అక్కడి నుంచే కదా.. అప్పుడేమైంది ఈ వాస్తు సమస్య..? అప్పుడు రాని సమస్య ఇప్పుడు రావడానికి కారణం ఏంటి..?

 

ఈ ప్రశ్నను కొంచం లోతుగా ఆలోచిస్తే.. ఎందుకంటే పీఠం మార్చే ఉద్దేశం ఉంది కాబట్టి, కుమారుడు కేటీఆర్ జాతకానికి పాతది అనువైనది కాదు కాబట్టి అనేది సమాధానంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పని చేశారు.. అందులో చాలా మంది ఈ సచివాలయం నుంచే పాలించారు. కానీ, ఏ ముఖ్యమంత్రి కొడుకూ ఇప్పటివరకు ముఖ్యమంత్రి కాలేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన రాష్ట్రం వేరు. ఇప్పుడు ఇదే మూఢనమ్మకంతో సీఎం కేసీఆర్ సచివాలయాన్ని కూల్చేందుకు సిద్దమైనట్టు స్పష్టంగా తెలుస్తుంది.

 

ఈ సందర్భంగా గతంలో ఒక్కసారి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మనం గుర్తుకుతెచ్చుకుందాం.. ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయినా తర్వాత తనకి జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉందని చెప్పారు.. 2019 ఎన్నికల సమయంలో బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా ఒక కూటమి కూడా కట్టే ప్రయత్నం కూడా చేశారు. అందుకు అనుగుణంగానే కొడుకుకి సీఎం పదవి అప్పగించి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నట్టు సమాచారం. పైగా ఈసారి మోదీ ప్రభుత్వం వన్ ఇండియా – వన్ ఎలక్షన్ అనే ఆలోచనలో ఉంది. దీంతో త్వరగా కొడుకు చేతికి అధికారాన్ని ఇచ్చి, ఆయన జాతీయ స్థాయిలో చక్రం తిప్పడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: