ఏమైనా అంటే భక్తులకు కోపం గాని... ఈ ఏడేళ్ళలో మార్పు ఏందో చెప్పరా...? అంటే ఎవడూ చెప్పడు. డిజిటల్ ఇండియా తప్పించి ఎవడి దగ్గరా సమాధానం లేదు. ఏమైనా అంటే భోగి బిల్ వంతెన, లేదా అటల్ టన్నెల్. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు నిధులు మంజూరు చేసి ఫోటోలు దిగి హడావుడి చేస్తే మొత్తం మా వాడే చేసాడు అంటారు గాని నిజంగా సామాన్యుడికి జరిగిన లబ్ది ఏంటో ఎవడూ చెప్పడు. ఎన్నికకో వేషం వేస్తే రవీంద్ర నాథ్ ఠాగూర్ గా, లేకపోతే పెరియార్ రామస్వామిగా చెప్పి కీర్తిస్తారు గాని ఎవడికి కనీస అవగాహన లేదు. 


మన కుటుంబం ఏ తప్పు చేసినా ఒకడు కాపాడినట్టు. పైనాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కిందాడి కుటుంబం సంక నాకిపోయినా సరే గుడ్డి భజన చేస్తూ యుగ పురుషుడుగా చెప్తూ కాపాడుతున్నాడు. అన్న నీకో మాట చెప్తానే... గుండెల మీద చెయ్యేసుకో... నోట్ల రద్దు వల్ల  ఉపయోగం ఏందీ...? పెద్ద నోటు రద్దు అయింది అవినీతి తగ్గింది అంటావ్. వెయ్యి రూపాయల నోటు కంటే రెండు వేల నోటు ఇంకా పెద్దదేగా అన్నా...? కాదంటావా...? ఎవరో టీటీడీలో ఉన్న వ్యక్తి ప్రింటింగ్ ప్రెస్ కి వెళ్లి వంద కోట్లు తెచ్చుకుంటే ప్రభుత్వాలను శాసించే కార్పోరేట్ వ్యాపారవేత్తలకు ఏదైనా నష్టం ఉందా...? 


నోట్ల రద్దు తర్వాత బెజవాడ ఆటో నగర్ లో లారీలు అమ్ముకున్నాడు ఉన్నాడు గాని ఆస్తులు అమ్ముకున్న అంబానీలు అధానీలు ఉన్నారా అన్నా... కరోనా మొదటి వేవ్ లో దేశాధ్యక్షులు అందరూ ఉచ్చ పోసుకోవడానికి తీరిక లేకుండా కష్టపడితే... 48 లక్షల మంది జనాభా ఉన్న న్యూజిలాండ్ మహిళా అధ్యక్షురాలు నా దేశంలో కరోనా లేదని యెగిరి  గంతులేస్తే... చప్పట్లు కొట్టించి, కొవ్వొత్తులు వెలిగించి టైం వేస్ట్ చేసాడు గాని ముందస్తు ప్రణాళికతో వెళ్ళాడా...? ఆక్సీజన్ లేక జనం చచ్చే పరిస్థితి తెచ్చాడు.  మందులు లేవు వ్యాక్సిన్ లేదు. 


దేశం సంకనాకిపోతుంటే ట్రంప్ కి ప్రచారం చేసాడన్నా... ఆలోచించు ఒకసారి. ఫలితంగా లాక్ డౌన్ లు, కర్ఫ్యూలు, వ్యాపారాలు బంద్, సినిమాలు బంద్, కాని పన్నుల పెంపు మాత్రం ఆగలేదుగా...? నీకు తెలుసుగా ఏ వ్యాపారం బాగుంది చెప్పు...? ఏ ఉద్యోగంలో వంద శాతం జీతం ఇస్తున్నారు చెప్పు...? గవర్నమెంట్ ఉద్యోగస్తుడి జీతంలో కూడా కోత పడిందిగా...? ఆస్పత్రి ఖర్చులు ఎంత...? కరోనా వచ్చి ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే పాతిక లక్షలు ఫీజు కట్టారు. పాతిక లక్షలు లేనాడి పరిస్థితి ఏంటీ...? సగం సంకనాకిపోయాం, పూర్తిగా నాకిపోయినాళ్ళు కోట్ల మంది ఉన్నారు.


ఇంత నష్టపోయినా పన్నులు వసూళ్లు ఆగిందా...? నువ్వు సహాయం చేసిన నేపాల్ 55 రూపాయలకు అమ్మితే నువ్వు పెట్రోల్, డీజిల్ వంద రూపాయలకు కొనుక్కోవాలా...? భారత ఆర్ధికకు వ్యవస్థకు గుండెకాయ లాంటిది గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ,చిన్న చిన్న పట్టణాల ఆర్ధిక వ్యవస్థ. ఈ రోజు ఏ వ్యాపారం బాగుంది...? డీజిల్ పెరిగింది ఆటో కిరాయి పెరిగింది, 3 గంటల అనుమతులు... వ్యాపారం లేదు... కాని కిరాయి మాత్రం పెరిగింది, కొట్టు అద్దెకు తీసుకుంటే ఓనర్ కి ఆదాయం తగ్గి అద్దె పెంచాడు. ఎవడూ ఎవడ్ని అడగలేని పరిస్థితికి మనం దిగజారిపోయాం కదా అన్నా...?



ఎన్నో వ్యాపారాలు నాశనం అయిపోయి, ఆత్మహత్యలు చేసుకుంటే ప్రజల నుంచి వసూళ్లు చేసి... ఇన్ని లక్షల కోట్లు పన్నులు పెరిగాయని చెప్పారు. ఒక సామాన్యుడిగా నాకు కోపం వస్తుందన్నా... రెండు కేజీల చికెన్ తెచ్చుకుని నా కుటుంబం మొత్తం తినేది అన్న రెండు పూటలా... ఇప్పుడు అరకేజీ తెచ్చుకుని తలో ముక్క వేసుకుని కోరిక చంపుకుంటే... 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరిగి 1.85 లక్షల కోట్లకు చేరుకున్నాయని అధికారిక ప్రకటన చేసారన్న.


ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి వల్ల ప్రభావం ఉన్నా సరే నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు బలమైన వృద్ధిని సాధించాయని చెప్పారన్నా. జూన్ 15 నాటికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్ను వసూలు గణాంకాలు, నికర వసూళ్లు రూ .1,85,871 కోట్లుగా ఉన్నాయని ప్రకటన చేసారే... గత ఏడాది అంటే ఇదే టైంలో ఇదే కాలంలో రూ .92,762 కోట్లు వస్తే జనాలు సంకనాకిపోయి తినడానికి కూడు లేక చస్తుంటే 100.4 శాతం పెరిగింది అని చెప్పారు. కార్పొరేట్ పన్ను 74,356 కోట్ల రూపాయలు... వ్యక్తిగత ఆదాయ పన్ను 1,11,043 కోట్లు అంట.


కార్పోరేట్ సంగతి వదిలేయ్... వ్యక్తిగత ఆదాయపు పన్ను లక్షా 10 వేల కోట్లు అంట. వ్యాపారాలు మూసుకోలేక, టర్నోవర్ జరగక... అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు కాపాడుకుని ఎంతో కొంత ఆదాయం వస్తే లక్షా పదివేల కోట్లు వసూలు చేసాడన్నా. మారిటోరియం అని చెప్పాడు... మారిటోరియం తీసుకున్న ఏ ఒక్కడూ కూడా ఈ రోజు  బ్యాంకు లో లోన్ తీసుకోలేక క్రెడిట్ కార్డ్ లిమిట్ లేక ఆస్తులు అమ్ముకుంటే... లాక్ డౌన్ కర్ఫ్యూలో ఎన్నో వ్యాపారాలు కూలిపోయి... కుటుంబాలను పోషించడానికి నమ్మి ఉద్యోగంలో పెట్టుకున్న కుటుంబాలను కాపాడటానికి ఆస్తులు అమ్మితే...



ఆ రేంజ్ లో పన్నులు వసూలు చేసి... సోషల్ మీడియాలో గట్టిగా అడిగితే దేశ ద్రోహి, కమ్మి  గాడని తిట్టడం ఏంటి అన్నా...? లాక్ డౌన్ లో సామాజిక దూరం, కరోనా కట్టడి కావాలంటే కర్ఫ్యూ అని చెప్పి ఎన్నికల ప్రచారాలు చేసుకుని గెలిచి ఊరేగుతూ... ఈ రోజు దేశాన్ని దిగజార్చి, మన జనాభాలో .000001 ఉన్న వాడి దగ్గర సహాయం తీసుకునేలా చేసి... ఏడేళ్ళలో ఏం బాగుపడ్డావ్ అన్నా...? చైనాతో గొడవ, సర్జికల్ స్ట్రైక్, పాకిస్తాన్ కంటే ఎక్కువ ఆయుధాలు, చైనా బోర్డర్ లో రోడ్డు పోసి అది విజయంగా చెప్పుకుంటే నీ బ్రతుకు ఏంటన్నా...? ఇది రాసిన నేను దేశ ద్రోహిని కాదన్నా, నాది వేరే మతం కూడా కాదు నేను హిందువునే అన్నా... అన్నా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వస్తుంది 500 నోటు జాగ్రత్తా.


మరింత సమాచారం తెలుసుకోండి: