
సొంత ఫ్యామిలీనే ఆమెకు వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టింది...వ్యతిరేకంగా పనిచేయడమే కాదు...వ్యతిరేక పార్టీలోకి వెళ్ళి మరీ, పుష్పశ్రీ వాణి ఓటమి కోసం పనిచేస్తున్నారు. ఇప్పటికే పుష్పశ్రీ వాణి సొంత మామ శతృచర్ల చంద్రశేఖర్ రాజు వైసీపీని వీడి టీడీపీలో చేరి, పుష్పశ్రీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు..అటు మరో మామ, సీనియర్ నేత శతృచర్ల విజయరామరాజు సైతం అదే పనిలో ఉన్నారు.
ఇక తాజాగా పుష్పశ్రీ వాణి ఆడపడుచు, పల్లవి రాజు టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు.. చంద్రశేఖర్ రాజు కుమార్తె పల్లవి రాజు. ఇలా సొంత ఫ్యామిలీనే పుష్పశ్రీకి యాంటీగా మారిపోయింది. పైగా ప్రత్యర్ధి పార్టీలో చేరి ఆమెకు వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధమయ్యారు. పైగా వచ్చే ఎన్నికల్లో పుష్పశ్రీపై సొంత ఫ్యామిలీనే పోటీ చేసే అవకాశం ఉంది. రెండుసార్లు పుష్పశ్రీపై జనార్ధన్ పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. టీడీపీ తరుపున పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయారు. జనార్ధన్..శతృచర్ల మేనల్లుడు. అయితే ఆ మధ్య అనారోగ్యంతో జనార్ధన్ చనిపోయారు...తర్వాత జనార్ధన్ తల్లి కూడా చనిపోయారు.
దీంతో ఇప్పుడు కురుపాం సీటు ఎవరికి దక్కుతుందో క్లారిటీ లేదు...ఓ వైపు జనార్ధన్ భార్య సీటు కోసం ట్రై చేస్తున్నారు...ఇటు పుష్పశ్రీ ఆడపడుచు పల్లవి సైతం టీడీపీలో చేరి సీటు దక్కించుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఏదేమైనా టీడీపీ సీటు పుష్పశ్రీ ఫ్యామిలీకి చెందినవారికే దక్కేలా ఉంది..మరి చూడాలి సొంత ఫ్యామిలీ చేతిలోనే పుష్పశ్రీకి ఓటమి వస్తుందో లేదో?