ఏపీలో సరఫరా అవుతున్న మద్యంలో విష పదార్థాలు ఉన్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ మద్యాన్ని తాము ల్యాబుల్లో పరీక్షలు చేయించామని.. వీటిలో విష పదార్థాలు ఉన్నట్టు తేలిందని టీడీపీ హడావిడి చేసింది. అయితే.. ఈ వాదనను  ఏపీ లిక్కర్ అండ్ బీర్ సప్లయర్స్ అసోసియేషన్ ఖండిస్తోంది. ఏపీలో సరఫరా చేసే మద్యంలో విష పదార్థాలు లేవని తేల్చి చెప్పింది. కావాలనుకుంటే ఎవరైనా వచ్చి తనిఖీ చేసుకోవచ్చని సూచించింది.


ఏపీ మద్యంలో ఎటువంటి హానికర పదార్ధాలు లేవని .. నిబంధనల ప్రకారమే మద్యాన్ని తయారు చేస్తామని ఏపీ లిక్కర్ అండ్ బీర్ సప్లయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రతీ రాష్ట్రంలో 184 బ్రాండ్లు ఉంటాయని .. లిక్కర్ ఇండస్ట్రీ పై ఆధార పడి  4 లక్షల మంది జీవిస్తుంటారని ఏపీ లిక్కర్ అండ్ బీర్ సప్లయర్స్ అసోసియేషన్ చెబుతోంది. మద్యంపై ఏడాదికి 36వేలు నుంచీ 40వేల కోట్ల ఆదాయం రాష్ట్రానికి వస్తుందని ఏపీ లిక్కర్ అండ్ బీర్ సప్లయర్స్ అసోసియేషన్ వివరించింది.


శాంపిల్స్ పరీక్ష చేసిన తర్వాత మద్యం తయారు చేసి డిపోలకు పంపుతామని ఏపీ లిక్కర్ అండ్ బీర్ సప్లయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. డిస్టిలరీస్ లో టెక్నికల్ ప్రాబ్లెం వలన ఐదు రోజులుగా కొన్ని రకాల మద్యం బ్రాండ్ లను డిస్పాచ్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నామని ఏపీ లిక్కర్ అండ్ బీర్ సప్లయర్స్ అసోసియేషన్ తెలిపింది. నేవీ ల్యాబ్ లో ఎఫ్ ఎస్ఎస్ ఐ నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారని.. మేము కూడా శాంపిల్ లను పరీక్ష లకు పంపామని .. మూడు రోజుల్లో మేము చేయించిన పరీక్షల రిపోర్టు వస్తుందని అసోసియేషన్ అధ్యక్షులు వివరించారు.


తెలంగాణ లో మాకు ఎక్కువ రేటు వస్తోందని ..ఏపీలో ధరలు పెంచకపోతే మాకు ఇబ్బందికరంగానే ఉందని ఏపీ లిక్కర్ అండ్ బీర్ సప్లయర్స్ అసోసియేషన్ అంటోంది. మద్యం బ్రాండ్ లను బలవంతంగా రీటైల్ లో పెట్టినా కస్టమర్ సంతృప్తి చెందకపోతే బిజినెస్ రాదని వారు అంటున్నారు. కొన్ని బ్రాండ్లు మార్కెట్లో ఎందుకు లేవు అనే విషయం బ్రాండుకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న ఒప్పందంపై ఆధార పడి ఉంటుందని ఏపీ లిక్కర్ అండ్ బీర్ సప్లయర్స్ అసోసియేషన్ కామెంట్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: