కష్టం ఎవరికి వచ్చినా కష్టమే. అది ఒక విఐపి కి, ఒక రాజకీయ నాయకుడికి వస్తేనే కష్టం అని, మిగిలిన వర్గాల వారికి వస్తే అది కష్టమే కాదన్నట్లుగా తయారయింది ఇప్పటి పరిస్థితి. చంద్రబాబు  స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు విషయంలో రాజమహేంద్రవరం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే అక్కడ చంద్రబాబుని విజిట్ చేయడానికి ఇవ్వాల్సినన్ని ములాఖాతులు ఇవ్వడం లేదని అంటున్నారట తెలుగుదేశం వర్గాల వారు.


వాస్తవంగా వారానికి రెండు ములాఖాతులు  మాత్రమే ఉంటాయని పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతున్న కూడా నమ్మడం లేదు వీళ్లు. ఇప్పటికే రాజమహేంద్రవరం జైల్లో సెక్యూరిటీ సరిగ్గా లేదని, వసతులు కూడా సరిగ్గా లేవని  అంటున్నారట. నిజానికి అది చంద్రబాబు గారు స్వయంగా పర్యవేక్షించి కట్టించిన కట్టడం. ఆయన కట్టించిన కట్టడంలో ఆయనే వసతులు లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.


అయితే ఆయనని పర్యవేక్షించే సందర్భంగా జైల్ సూపరింటెండెంట్ కి తన భార్య ఆస్పత్రిలో ఉన్నా సెలవు పెట్టలేని పరిస్థితి ఏర్పడిందట. ఎలాగోలా ఆయన ఇన్చార్జిని పెట్టి రెండు రోజులు సెలవు పెట్టి వెళ్తే ఏదో కుట్ర జరుగుతుందంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు టిడిపి శ్రేణులు. జైల్లోనే ఆయనను ఏదో  చేయడానికి కుట్ర జరుగుతుందని అనుమానిస్తున్నారట. అయితే గతంలో అధికార పక్షంలోనూ, ఇప్పుడు ప్రతిపక్షంలోనూ ఉన్న ఒక ముఖ్య నాయకుడిని జైల్లో ఏదైనా చేస్తే ఆ తర్వాత ఇప్పటి ప్రభుత్వం అధికారంలో ఉంటుందా. అసలు అలా చేసే దమ్ము ఎవరికైనా ఉంటుందా అని ఈ అనుమానాలపై ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది.


ఒక రిమాండ్ ముద్దాయికి ఒక వారంలో రెండు మూలాఖాతులు మాత్రమే ఇస్తారని, జైలు అధికారులు మూలాఖాత్ కు సంబంధించిన రూల్స్ క్లియర్ గా చెప్పడం  జరిగింది. ఆల్రెడీ 16వ తారీఖున మధ్యాహ్నం నారా భువనేశ్వరి దేవి నారా లోకేష్ నారా బ్రాహ్మణి, రెండవ మూలాఖాత్ లో పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ వచ్చారని చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: