రాజకీయాన్ని రాజకీయంలా చేయకుండా వ్యక్తిగతంగా కక్షసాధింపు చర్యలకు వాడుకుంటున్నారు. ఇందులోకి చట్టాలను, న్యాయాలను తీసుకువచ్చి ప్రత్యర్థులను ఇరుకున  పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఆ తర్వాత ఆ చిక్కుల్లో తామే పడతా అనే విషయాన్ని రాజకీయ నాయకులు మరిచిపోతున్నారు. పదవి శాశ్వతం అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవడం లేదు.


తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఒకప్పుడు హుందాగా ఉండే రాజకీయాలు ప్రస్తుతం దారి తప్పుతున్నాయి.  అసెంబ్లీలోను, పార్టీ ప్రచార కార్యక్రమాల్లోను ఒకరిని ఒకరు విమర్శించుకునే వారు తప్ప బయట కలుసుకుంటే సరాదాగా మాట్లాడుకునేవారు తప్ప వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లేవారు కాదు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. వాటి బదులు ప్రతీకార రాజకీయాలు మొదలయ్యాయి.  జగన్ మోహన్ రెడ్డి ని తీసుకుంటే అతని రాజకీయ జీవితాన్ని నాశనం చేద్దామని జైలులో పెట్టించి తద్వారా అతడిని తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలని భావించింది కాంగ్రెస్ పార్టీ.  


ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో తనకు అడ్డు ఉండదని భావించి చంద్రబాబు కూడా కాంగ్రెస్ నేతలకు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి.  అయితే జగన్ జైలు నుంచి బయటకి వచ్చిన తర్వాత సానుభూతి పొంది ఓ సారి ప్రతిపక్ష నేతగా ఎదిగారు. మరోసారి అధికారం చేపట్టి ముఖ్యమంత్రి కాగలిగారు. అయితే చంద్రబాబు జగన్ ను జైలు జీవితాన్ని ఉదహరిస్తూ నేనేప్పుడు తప్పు చేయలేదు. అందుకే జైలుకు వెళ్లలేదు అంటూ ప్రచారం చేసుకునేవారు.


బెయిల్ పై ఉన్న వ్యక్తి సీఎం జగన్ అంటూ విమర్శించేవారు. అయితే అవినీతి కేసులో చంద్రబాబుని కూడా దాదాపు 52 రోజులు జైల్లో పెట్టించగలిగారు జగన్. ఒకవేళ ఆయన భవిష్యత్తులో సీఎం అయితే బెయిల్ పై ఉన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలుస్తారు. ఇప్పుడు తెలంగాణలో పార్టీని విజయపథంలో నడిపించి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్  రెడ్డి కూడా ఓటుకు నోటు కేసులో బెయిల్ పైనే బయట ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీకార రాజకీయాలు జైళ్లు, బెయిల్లు చుట్టూనే నడుస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: