ప్రస్తుత సీఎం చంద్రబాబు విషయానికి వస్తే ఆయన పని తీరు పూర్తిగా విభిన్నం. 75 ఏళ్ల వయస్సులో ఉన్నా.. ఆయన శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉంటూ, రోజు మొత్తం పరిపాలనా పనుల్లో మునిగిపోయి ఉంటారు. సాధారణంగా వయస్సు దృష్ట్యా మధ్యాహ్నం సమయంలో విశ్రాంతి తీసుకుంటారని అనుకుంటారు.. కానీ చంద్రబాబు అలాంటి విరామం తీసుకునే సందర్భాలు చాలా అరుదు. మొంథా తుఫాను ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, ఆయన ఉదయం 10 గంటలకు ఆర్టీజీఎస్ కేంద్రానికి చేరుకొని రాత్రి 11 గంటల వరకూ అక్కడే కొనసాగారు. జిల్లాల వారీగా అధికారులు, కలెక్టర్లు, మంత్రులతో సమీక్షలు నిర్వహించారు. కేంద్రంతో, ముఖ్యంగా ప్రధాని మోడీతో కూడా సంప్రదింపులు జరిపి నిధులపై ఆరా తీశారు. ప్రతి జిల్లాలో వర్షపాతం, బాధితుల పరిస్థితి, సహాయక చర్యల పర్యవేక్షణ అన్నింటినీ స్వయంగా పరిశీలించారు.
ఇది ఒక్కసారి మాత్రమే కాదు. గత సంవత్సరం విజయవాడ వర్షాల సమయంలో కూడా చంద్రబాబు మోకాళ్ల లోతున నీటిలో తిరిగి పరిసరాలను పరిశీలించిన ఘటన ప్రజల మనస్సుల్లో అలా నిలిచిపోయింది. విదేశీ పర్యటనల్లోనూ ఆయన ఇదే శ్రద్ధ చూపిస్తున్నారు. దుబాయ్‌లో జరిగిన సమావేశంలో ఆయన నాలుగు గంటలపాటు ఎడతెరిపి లేకుండా ప్రవాస భారతీయులతో మాట్లాడారు. ఇలా, విశ్రాంతి లేకుండా రాష్ట్ర పరిపాలనకు తన పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్న సీఎం చంద్రబాబు పని తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన కేటాయించే టైం, క్రమశిక్షణ .. పరిపాలనా శైలి పాత తరానికి కూడా ప్రేరణగా నిలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి