తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2023 ఫలితాలు రేపు (సెప్టెంబర్‌ 27) విడుదల చేయనున్నారు. ఇప్పటికే టెట్‌ పరీక్ష కు సంబంధించి ప్రాథమిక కీ విడుదల చేసిన విషయం తెలిసిందే.ఫైనల్ ఆన్సర్‌ కీ తో పాటు ఫలితాల ను కూడా బుధవారం విడుదల చేయనున్నట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు.నోటిఫికేషన్ లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఫలితాలు విడుద లకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు. టెట్‌కు హాజ రైన అభ్యర్ధులు సెప్టెంబర్‌ 27వ తేదీన తుది 'కీ' తో పాటు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ లో చెక్‌ చేసుకోవచ్చని తెలిపారు.అయితే టెట్‌ పరీక్ష పేపర్‌-1కు దాదాపు 2,69,557 మంది దరఖాస్తు చేసు కోగా.. వారిలో 2,26,744 (84.1 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు.

అలాగే పేపర్‌ 2కు 2,08,498 మంది దరఖాస్తు చేస్తే.. వారి లో 1,89,963 మంది అంటే 91.11 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఇప్పటి కే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. టెట్‌ ఫలితాల ప్రకటన తరువాత అందులో ఉత్తీర్ణు లైన వారు కూడా దరఖాస్తు చేసే వీలు ఉంటుంది. దీనితో టెట్‌ ఫలితాల ను వెంటనే ప్రకటించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలా ఉంటే సోమవారం (సెప్టెంబర్ 25)సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్‌) ఫలితాలను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ విడుదల చేసింది. ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీన దేశవ్యాప్తం గా పలు పరీక్ష కేంద్రా ల్లో సీటెట్‌ 2023 పరీక్ష జరిగిన విషయం తెలిసిం దే. మొత్తం 29 లక్షల మంది అభ్యర్ధులు ఈ పరీక్ష కు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పేపర్‌ – 1కు 15 లక్షల మంది దరఖాస్తు చేసు కోగా, పేపర్‌ – 2కు 14 లక్షల మంది దర ఖాస్తు చేసు కున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: