తలనొప్పి రావడానికి అనేక కారణాలున్నాయి వాటిలో ముఖ్యమైనది నిద్ర సరిగా రాకపోవడం, పని ఒత్తిడి వల్ల,మానసిక సమస్యలు, వంటి సమస్యల వల్లతలనొప్పి వస్తూ ఉంటుంది.కొన్నిసార్లు ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా వస్తుంది. తలనొప్పి వల్ల ఏ పని చేయాలన్నా చేయలేకపోతున్నాం. నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్లు వాడుతూ ఉంటాం, కానీ వాడు ఎప్పుడూ మాత్రమే నొప్పి తగ్గుతుంది. తర్వాత మరల మొదలవుతుంది. ఎక్కువ టాబ్లెట్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తాయి.  కాబట్టి ఇంట్లో ఉండే వాటితోనే తలనొప్పిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఇంట్లో ఉండే పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 తల నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం చక్కెర, ధనియాలు కలిపి తీసుకోవడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

 ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో పసుపు పొడి కలుపుకొని తాగడం వల్ల తల నొప్పి బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది.

 పాలలో రాళ్ల  ఉప్పు కలుపుకొని తాగడం వల్ల కూడా తలనొప్పి తగ్గుతుంది. ఒక గ్లాసు వేడి నీటిలోనిమ్మరసం పిండుకుని తాగినా కూడా తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

 నొప్పి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు నుదిటి పైన కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోవాలి.  ఇలా చేయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది.

 తలనొప్పి వచ్చినప్పుడు ఉల్లిపాయ తీసుకొని పేస్ట్గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను తలపై పెట్టుకోవడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

 తలనొప్పికి యూకలిప్టస్ తైలం బాగా పనిచేస్తుంది.ఇంకా చందనం బాగా సాది మొదటి పైన రాయడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

 తలనొప్పి తగ్గడానికి ఒక గ్లాసు వేడి నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం కలుపుకొని తాగితే తలనొప్పి తగ్గిపోతుంది.

 తలనొప్పిగా ఉన్నప్పుడు ఒక యాపిల్ పండు తిని ఒక గ్లాసు గోరువెచ్చటి పాలు తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంది.

 జీడిపప్పు, పిస్తా,బాదం పప్పు వీటిని నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు తీసుకుంటే నుంచి ఉపశమనం కలుగుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: