ఆరోగ్యమే  మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనం జీవితంలో  ఏది సాధించాలన్నా  ఏం చేయాలన్నా ఆరోగ్యం అనేది కాపాడుకుంటూనే మనం అనుకున్నది సాధించగలం. ప్రస్తుత కాలంలో వాతావరణంలో జరిగే  మార్పులతో అనేక రోగాలు వస్తున్నాయి. చెట్లు నరకడం, ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు, ఇతరాత్ర కాలుష్య కారకాలతో  వాతావరణమంతా కలుషితమై  పెద్ద పెద్ద రోగాలు కూడా వస్తున్నాయి. మన అజాగ్రత్తతోనే కరోణ లాంటి మహమ్మారిలు దాడి చేస్తున్నాయి. వీటికి తోడు మనం  తినేటటువంటి ఫాస్ట్ ఫుడ్ వంటి ఐటమ్స్ వల్ల ఆరోగ్యం క్షీణిస్తోంది.

ప్రస్తుత కాలంలో ప్రఖ్యాత ఆహారపు అలవాట్లకు అలవాటుపడి కలుషితమైన, ఫ్రిజ్లో పెట్టినటువంటి ఆహారం తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్ పట్టణంలో  డైమండ్స్ బావర్చి బిర్యాని హోటల్ లో  ఓ యువకుడు బిర్యాని తిందామని వెళ్లారు. ఆ యువకుడు ఎంతో ఆకలితో ఉండి గబగబా బిర్యాని తింటుండగా బిర్యానీలో  గోడకు పాకే  ఆరు కాళ్లు గల బల్లి  దర్శనమిచ్చింది. దీంతో ఆ యువకుడు  ఒక్కసారిగా తాను తిన్నదంతా బయట కక్కేసాడు. దీంతో సదరు యువకుడు బిర్యాని సెంటర్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

షాద్నగర్ పట్టణంలోని  చాలా బిర్యాని సెంటర్లలో, హోటళ్లలో, బేకరీలలో  నిత్యం ఇలాంటి ఘటనలు దర్శనం ఇస్తున్నాయని  అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటున్నారు. తాజాగా ఆరు కాళ్ల బల్లి  ఆ యువకుడు  తింటున్న బిర్యానీలో రావడం ఈ విషయం అంతా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికి కూడా  ఫుడ్ ఇన్స్పెక్టర్, ఇతర అధికారులు ఎవరు కూడా  సదర్ బిర్యాని సెంటర్ యాజమాన్యంపై గాని చర్యలు తీసుకోలేకపోవడం అమానుషమని బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై  నెటిజన్లు  పలు విధాలుగా  ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదర్ బిర్యాని సెంటర్ నిర్వాహకునిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: