మన దేశంలోని ప్రజలు అత్యధికంగా తినే ఆహారం బియ్యం. చాలా మంది కూడా అసలు అన్నం లేని భోజనం చేసేందుకు ఇష్టపడరు. అయితే రోజు అన్నం తినడం వల్ల మంచి, చెడు రెండూ ఉంటాయన్నారు. అన్నం తింటే బరువు పెరుగుతారని ఇంకా మధుమేహం వస్తుందని చెబుతుంటారు. విటమిన్లు, ఖనిజాలు చాలా తక్కువగా ఉన్నందున వైట్ రైస్ తినడం చాలా ప్రమాదకరం. బియ్యం ఖచ్చితంగా గ్లైసెమిక్ ఇండెక్స్‌ను పెంచుతుంది. శరీరంలోకి చేరిన కార్బోహైడ్రేట్‌లను చాలా త్వరగా చక్కెరగా మార్చవచ్చో కొలవడానికి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉపయోగపడుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు ఎప్పుడు ఉత్తమమైనవి. అయితే బియ్యం మాత్రం గ్లైసెమిక్ ఇండెక్స్ 64. అందుకే, బియ్యం ఎక్కువగా తింటే టైప్ 2 డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఉంది.ఇంకా అంతేకాకుండా, బియ్యం ఖచ్చితంగా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం కూడా ఉంది. అంతే కాకుండా రోజూ అన్నం తినే వారికి రక్తపోటు ముప్పు చాలా ఎక్కువగా వస్తుంది.


లేదంటే ఉపవాస సమయంలో మధుమేహం పెరిగిపోయి శరీరంలో ట్రైగ్లిజరైడ్లు పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఇంకా అలాగే ఇది నడుము చుట్టుకొలతను కూడా పెంచుతుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా క్రమంగా తగ్గిస్తుంది.ఇక మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే, అన్నం తినడం మానేయండి. దాని బదులు రాగి సంగటి తినండి.అన్నం తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ ఇంకా ఊబకాయం వస్తుంది.అందుకే మీరు బియ్యం స్థానంలో వేరే ఏదైనా ఉంటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు అన్నం తినడం వల్ల ఫోలేట్ స్థాయిలు అనేవి తగ్గుతాయి. ఇక అందువల్ల, గుండెల్లో మంట లేదా అజీర్ణంతో బాధ పడతారు.. కాబట్టి అన్నంని ఎప్పుడూ మితంగా తినడం మంచిది.అన్నానికి బదులుగా జొన్నలు, రాగి సంగటి లాంటివి అలవాటు చేసుకోండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. మన పూర్వికులు కూడా పురాతన కాలంలో ఇవి తినే ఎన్నో వందల సంవత్సరాలు బ్రతికేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: