ఇటీవల కాలంలో ప్రతిఒక్కరూ ఆధునిక టెక్నాలజీ కి బాగా అలవాటు పడిపోతారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మొబైల్ వాడకం ఎక్కువయింది. ఇక అందుకు తగ్గట్టుగానే పిల్లలు , యువత కూడా  ఎక్కువగా హెడ్ ఫోన్లు, ఇయర్ బడ్స్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇక ఎంజాయ్ చేయడం కోసం  సౌండ్ ఎక్కువగా పెట్టుకొని మరీ  ఆడియోని తెగ ఎంజాయ్ వంటివి చేస్తుంటారు. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 70 డెసిబెల్స్ కు మించిన శబ్దంతో ఆడియో వినడం వల్ల భవిష్యత్తులో వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేల్చి చెప్పారు.  కానీ ఎక్కువ శాతం పిల్లలు, యువత 85 డెసిబెల్స్ కంటే ఎక్కువ సౌండ్ తో ఆడియోను వింటున్నారని, ఇలాంటి వారిలో అతి చిన్న వయసులోనే వినికిడి లోపం ఏర్పడుతోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది.  అలాగే  యూఎస్ఏ కు చెందిన స్వచ్ఛంద సంస్థ "ది క్వైట్ మెంబెర్ డేనియల్ పింక్ " చెబుతున్నారు.

70 డిసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దం  వినడం వల్ల పిల్లలు, యువతకు అంత మంచిది కాదని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఫ్యాక్టరీల నుంచి వెలువడే శబ్దం , అందులో పనిచేసే  కార్మికులకు 85 డెసిబెల్ శబ్దం వరకు వాళ్లకి ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ ఈ శబ్దం వల్ల చిన్న పిల్లలలో ఎక్కువ ప్రమాదం ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు పిల్లలు హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్ వంటి పరికరాలను ఉపయోగించడం  తగ్గించమని ఆయన చెప్పారు. ఒకవేళ వీటిని ఉపయోగించాలంటే 70 డెసిబెల్స్ కంటే తక్కువ పరిమాణంలో ఉన్న ఆడియో ని వినాలని ఆయన సిఫార్సు చేశారు. అందువల్ల చిన్న పిల్లలని ఫ్యాక్టరీల నుండి వెలువడే పెద్ద పెద్ద శబ్దాలు నుంచి దూరంగా ఉంచాలని చెబుతున్నారు.

జూన్ 8,10 మధ్య అమెరికాలో జరిగిన 180వ ఎకౌస్టికల్ సొసైటీ ఆఫ్ అమెరికా సమావేశంలో ఆయన ఈ వివరాలు పంచుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు 70 డెసిబెల్ శబ్దం మించకుండా  శబ్దాన్ని వినాలని ఆయన సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: