ప్రైవేట్ పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఖచ్చితంగా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు తెలుపుతున్నారు. యూరిన్ ఇన్ఫెక్షన్ కిడ్నీకి కనుక వ్యాపిస్తే క్యాన్సర్ సహా చాలా ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. యూరిన్ ఇన్ఫెక్షన్ అయిన కొంత సమయం తర్వాత మాత్రమే శరీరంలో లక్షణాలు కనిపిస్తాయి. కానీ ప్రజలు వాటిని అస్సలు పట్టించుకోవడం లేదు.అందువల్ల ఖచ్చితంగా ఈ వ్యాధి మూత్ర నాళం ద్వారా కిడ్నీకి కూడా వెళుతుంది. ప్రమాదకరమైన బ్యాక్టీరియా అనేది కిడ్నీకి ఖచ్చితంగా తీవ్రమైన హానిని కలిగిస్తుంది.మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా మంటగా ఉండటం చాలా సాధారణ లక్షణం. కొంతమందికి ప్రైవేట్ పార్ట్ నుంచి దుర్వాసన వచ్చే సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా అలాగే దీనితో పాటు, పొత్తి కడుపులో అకస్మాత్తుగా పదునైన నొప్పి  కూడా వస్తూ ఉంటుంది. అయితే ఈ సమస్య ఏ వయసులోనైనా రావచ్చు.


ఈ వ్యాధి కేసులు పిల్లలలో కూడా ఎక్కువగా సంభవిస్తాయి.అలాంటి లక్షణాలు శరీరంలో కనిపిస్తే తప్పకుండా ఆసుపత్రికి వెళ్లాలి. ఆ లక్షణాలను సకాలంలో గుర్తించడం వలన చాలా సులభంగా చికిత్స పొందవచ్చు.ఇంకా చాలా సందర్భాలలో యూరిన్ ఇన్ఫెక్షన్ కొన్ని రోజుల్లో దానంతటదే ఈజీగా నయమవుతుంది. అయితే ఈ సమస్య చాలా కాలం పాటు కొనసాగితే దానిని నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు డాక్టర్లు.ఇక యుటిఐ ఇన్‌ఫెక్షన్‌ను నివారించడానికి ప్రైవేట్ పార్ట్ ల పరిశుభ్రతపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం అని డాక్టర్లు తెలుపుతున్నారు. దీనితో మీ లోదుస్తులను ప్రతిరోజూ మార్చడం ఇంకా బయటకి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్లను కనిష్టంగా ఉపయోగించడం చాలా ముఖ్యం. అలాగే రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు ఖచ్చితంగా తాగాలి. ఇలాంటి ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా వెంటనే వైద్యుడిని సంప్రదించండి. మూత్రానికి సంబంధించిన ఏ సమస్యనైనా తేలికగా తీసుకోకండి. జాగ్రత్తగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: