
అవసరం ఉంటే తప్పిస్తే అనవసరంగా బయటకు రావద్దు అని . ప్రాపర్ హెల్త్ డైట్ ఫాలో అవ్వండి అంటూ సజెస్ట్ చేస్తున్నారు. అయితే సాధారణంగా ఏ స్టేట్ సీఎం అయినా సరే కరోనా వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు . కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన తర్వాతే కొత్త ప్రణాళికలను కొత్త మేనిఫెస్టోను విడుదల చేస్తూ ఉంటారు . అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం కరోనా కేసులు రాకముందు నుంచే ఏపీ ప్రజలకు తగిన సూచనలు చేస్తూ వచ్చారు. మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో పాజిటివ్ కేసు వచ్చింది అని తెలియగానే కేవలం విశాఖపట్నంలోనే కాకుండా అన్ని జిల్లాల అధికారులతో మాట్లాడి కరోనా కేసులు విజృంభించకుండా తగిన జాగ్రత్త చర్యలు పాటించేలా చేస్తున్నారు.
అంతే కాదు ఏపీలో కరోనా కేసులు పెరగకుండా ఎక్కడికక్కడ కోవిడ్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నారు . సాధారణంగా మిగతా స్టేట్స్ సీఎం ఏ జిల్లాల్లో కరోనా వచ్చింది అంటే ఆ జిల్లా వరకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం కరోనా పాజిటివ్ వచ్చిన జిల్లాకే కాకుండా ప్రతి ఒక్క జిల్లాకు కూడా కొన్ని కొవిడ్ నిబంధనలను పెట్టేశారు . కోవిడ్ ఏపీలో ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా చంద్రబాబు తన తెలివితేటలతో.. ముందు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటున్నారు అంటూ కూడా పక్క స్టేట్స్ సీఎంలు పొగిడేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికి చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని బాగానే పొలిటికల్ పరంగా ఉపయోగిస్తున్నాడు..!!!