భారత్ లో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. రోజు రోజుకి భారత దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో 3,395 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో కొత్తగా 685 కరోనా యాక్టివ్ కేసులు నమోదవడం జరిగింది. భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అందులో ముఖ్యంగా రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మరోసారి కరోనా డేంజర్ బెల్స్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కేరళలో ఆరుగురు కరోనాతో మృతి చెందారు. అలాగే మహారాష్ట్రలో ఏడుగురు మృతి చెందగా.. ఇకపోతే ఢిల్లీలో ముగ్గురు, కర్ణాటకలో ముగ్గురు కరోనా భారీనా పడి మరణించారు. ఉత్తర్ ప్రదేశ్ లో కూడా ఇద్దరు వ్యక్తులు కరోనాతో మరణించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో 17 మందికి కరోనా పాజిటివ్ రాగా.. తెలంగాణలో 3 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. కేవలం నిన్న ఒక్కరోజే దేశంలో కరోనాతో 8 మంది మృతి చెందారు. జనవరి నుండి ఇప్పటి వరకు భారతదేశంలో 26 మంది కరోనాతో మృతి చెందారు.

దీంతో ప్రజలు మరింత జాగ్రత్త పడాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కేంద్రం సూచిస్తుంది. అయితే ప్రస్తుతం వచ్చిన వేరియంట్లు ప్రమాదకరం కాకపోయినప్పటికీ వైరస్ ఎంత ప్రమాదకరమైందో తెలిసిందే. కాబట్టి కొత్త వేరియంట్ లు కూడా పుట్టుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వ్యాపిస్తున్న కరోనా లక్షణాలు చూసినట్లయితే.. తాజా వేరియంట్ లు ఎక్కువగా గొంతు పై ప్రభావం చూపిస్తున్నాయి. దీని కారణంగా ఎక్కువగా పొడి దగ్గుతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతిఒక్కరూ వీలైనంత వరకు పరిశుభ్రంగా ఉండాలి. జనాలు ఉన్న చోట్లకి వెళ్లకపోవడం చాలా మంచిదని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: