
బ్లాక్ వాటర్ తాగడానికి రుచికి సాధారణ నీరు లాగే ఉంటుంది.ఈ నీటి ధర కొంతమేరకు ఎక్కువగా ఉంటుంది. ఈ నీటిలో కూడా పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి.నీటిని తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువగానే ఉంటాయట..ph స్థాయి7 కంటే ఎక్కువగా ఉంటుంది.. సాధారణ నీటిలో ఆరు నుంచి 7 మధ్యలో ఉంటుంది. బ్లాక్ వాటర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి మన శరీరంలో ఉండే ఆమ్లత్వాన్ని తగ్గించడానికి కూడా సహాయ పడుతుందట. చర్మం కూడా ఫిట్ గా ఉండేందుకు ఉపయోగపడుతుంది బ్లాక్ వాటర్.
ఖనిజ లవణాలు కూడా ఎక్కువగా బ్లాక్ వాటర్ లో ఉంటాయి.. మనం సాధారణ నీటిలో ఫిల్టర్ చేసినప్పుడు కొన్ని ఖనిజాలు నాశనం అవుతాయి. బ్లాక్ వాటర్ లో చాలా ఖనిజాలను విడిగా కలుపుతారు ఇవి మన శరీరానికి కూడా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. సాధారణ నీటిలో కంటే బ్లాక్ వాటర్ తీసుకోవడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ చేయడం జరుగుతుంది.
బ్లాక్ వాటర్ వల్ల రక్తంలో చక్కెర నియంత్రణ స్థాయి ఉండడమే కాకుండా, హృదయ సంబంధిత వ్యాధులను కూడా తగ్గించడానికి,అలాగే ఎముకలు బలంగా ఉండడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అయితే ఈ బ్లాక్ వాటర్ ఎటువంటి వ్యాధిని నయం చేయలేదు.. కేవలం ఈ నీటిని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండడానికి ఒక ఎంపిక మాత్రమే.