కరోనా ఎప్పుడైతే విజృంభించిందో భారతదేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంతేకాదు ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు ప్రజలు. ఇదే తరుణంలో కరోనా వచ్చినప్పటి నుంచి సొంతంగా మెడిసిన్స్ తీసుకోవడం కూడా ప్రజలకు అలవాటైపోయింది. అయితే సాధారణ టాబ్లెట్లు వాడితే ఏమి కాదు కానీ, ఇలాంటి గుర్తింపు లేని టాబ్లెట్లు వాడితే మొదటికే మోసం వచ్చి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది.. ఈ మధ్యకాలంలో చాలామంది అత్యధిక బరువు వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ బరువును తగ్గించుకోవడానికి వ్యాయామంతో పాటు విపరీతమైన డైట్ చేస్తున్నారు. వీటన్నింటినీ పక్కనపెట్టి ఆన్లైన్ లో బరువు తగ్గే మెడిసిన్స్ కూడా కొనుగోలు చేస్తూ వాడుతున్నారు.

 అయితే తాజాగా అమెరికాకు చెందిన ఒక మెడిసిన్  ని  విపరీతమైనటువంటి కొనుగోలు జరిగిందని ఒక వార్త వినిపిస్తోంది. ఆ మెడిసిన్ అమెరికాలో తయారయ్యిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దాన్ని వాడితే బరువు తగ్గుతారని అంటున్నారు. ఆ మెడిసిన్ ఏంటి..అది ఎంత రికార్డు అమ్మకాలు జరిపింది అనే వివరాలు తెలుసుకుందాం.. తొందరగా బరువు తగ్గించడం కోసం అమెరికా తయారుచేసిన మెడిసిన్స్ మార్కెట్ లోకి వచ్చేసాయని సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మెడిసిన్స్ కేవలం నాలుగు నెలలోనే 100 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందట. మౌన్ జారో అనే ఈ మెడిసిన్ 2mg వారపు మోతాదు నెలకి వాడితే 14 వేల రూపాయల ఖర్చవుతుంది.

5mg  వారపు మోతాదు నెలకి వాడితే 17,500 అవుతుందట. ఇవి ఇండియాలో విపరీతంగా అమ్మకాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కట్ చేస్తే ఈ మెడిసిన్స్ గురించి ఇండియన్ డాక్టర్లు ఇప్పటివరకు ఎక్కడా ప్రస్తావించలేదు. కాబట్టి డాక్టర్ కు చెప్పకుండా ఇలాంటి మెడిసిన్స్ వాడితే  ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో కూడా తెలియదు. అసలు మన శరీరానికి సెట్ అవుతాయా లేదా కూడా తెలియదు. ఇలాంటివేమి తెలుసుకోకుండా మెడిసిన్ వాడి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళకండి అని కొంతమంది వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. డాక్టర్స్ చెప్పిన తర్వాత మాత్రమే మెడిసిన్స్ వాడాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: