చికెన్‌.. నాన్‌వెజ్ ల‌వ‌ర్స్ కు మోస్ట్ ఫేవ‌రెట్ అని చెప్పుకోవ‌చ్చు. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లో చికెన్ ఒకటి. అలాగే విటమిన్ బి6, విట‌మిన్ బి12, నయాసిన్, ఫాస్ఫరస్, సెలెనియం వంటి పోషకాలు కూడా చికెన్ లో నిండి ఉంటాయి. ఆరోగ్యానికి చికెన్ మంచిదే. కానీ దాన్ని ఎలా తింటున్నాము..? ఎంత‌ తింటున్నాము? అనేది చాలా ముఖ్యం. చికెన్‌తో ర‌క‌ర‌కాల డిషెస్ త‌యారు చేస్తుంటారు. అయితే ఇంట్లో చికెన్ వండిన‌ప్పుడు.. మిగిలిపోయిన దాన్ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుని తింటుంటారు.


అస‌లు వండిన చికెన్‌ను ఫ్రిడ్జ్‌లో ఎన్ని రోజులు నిల్వ చేయవచ్చు? అన్న విష‌యాన్ని మాత్రం పెద్ద‌గా ప‌ట్టించుకోరు. మామూలుగా వండ‌ని చికెన్‌ను ఫ్రిజ్‌లో 1 నుంచి 2 రోజులు మాత్రమే సురక్షితంగా నిల్వ చేయవచ్చు. అది కూడా కవర్లో బాగా సీలు చేసి లేదా ఎయిర్‌టైట్ బాక్స్‌లో పెట్టాలి. ఫ్రిజ్ టెంపరేచర్ 4°C  కంటే తక్కువగా ఉండాలి. వండ‌ని చికెన్‌ను ఫ్రిజ్‌లో 2 రోజులకు మించి ఉంచితే బాక్టీరియా వేగంగా పెరుగుతుంది. అటువంటి చికెన్ కు కుక్ చేసుకుని తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కువ రోజులు నిల్వ చేయాలనుకుంటే ఫ్రీజర్‌లో పెట్టడం ఉత్తమం.


ఇక‌పోతే వండేసిన చికెన్ ను ఫ్రిజ్‌లో 3 – 4 రోజులు వరకు సురక్షితంగా నిల్వ చేయవచ్చు. అయితే ఇక్క‌డ కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాలి. చికెన్ వండిన త‌ర్వాత 2 గంటలలోపే ఫ్రిజ్‌లో పెట్టాలి. త‌ప్ప‌నిస‌రిగా ఎయిర్‌టైట్ కంటైనర్‌లో ఉంచాలి. ఫ్రిజ్ టెంపరేచర్ 4°C కంటే తక్కువగా ఉండాలి. ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన చికెన్ ను తినే ముందు మళ్లీ బాగా వేడి చేయాలి. నాలుగు రోజులు దాటితే వాసన, రంగు, రుచి మారిపోతాయి. అటువంటి చికెన్‌ను తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. సో.. చికెన్ ల‌వ‌ర్స్ బీ కేర్‌ఫుల్‌!


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: