
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2013 జూలై 30వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటి ఆమోదం తెలిపింది.
దేవదాస్ కనకాల జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు దర్శకుడు నిర్మాత నట శిక్షకుడు అయిన దేవదాస్ కనకాల 1945 జూలై 30వ తేదీన జన్మించారు. నాటక దర్శకత్వం నుంచి సినిమా దర్శకుడిగా ఎదిగారు దేవదాస్ కనకాల. పూణేలో ఫిలిం ఇన్స్టిట్యూట్ లో విద్యనభ్యసించిన తొలితరం తెలుగు వారిలో దేవదాసు కనకాల ఒకరు. కేవలం సినిమా దర్శకుడు గా నే కాకుండా నటుడిగా కూడా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు, కీలక పాత్రలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కనకాల నట వారసుడిగా రాజీవ్ కనకాల తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు.
సోనూసూద్ జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు సోనుసూద్ 1973 జూలై 30వ తేదీన జన్మించారు. భారతీయ చిత్ర పరిశ్రమలో వివిధ భాషల్లో నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించారు. హిందీ పంజాబీ తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలో ఎంతగానో క్రేజ్ సంపాదించారు సోనూ సూద్. ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రల్లో.. నటించి ఎంతో గుర్తింపు సంపాదించారు. అయితే ఫిట్నెస్ విషయంలో ఎంతో కఠినంగా ఉండే సోనుసూద్ ప్యూర్ వెజిటేరియన్ అన్న విషయం చాలా మందికి తెలియదు. అయితే గత కొన్ని రోజుల నుంచి సోను సూద్ తన పెద్ద మనసు చాటుకుంటూ ఎంతో మందికి సహాయం చేస్తున్నారు.
సోను నిగమ్ జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు.. సంగీత దర్శకుడు అయిన సోనూ నిగమ్ 1973 జూలై 30వ తేదీన జన్మించారు. నేపథ్య గాయకునిగా సోను నిగమ్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో వివిధ భాషల్లో ఎన్నో పాటలు పాడి సోనూ నిగమ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. సినిమాలో నటుడిగా కూడా తన సత్తా చాటి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు సోనూ నిగమ్.
ఇంగ్మర్ బెర్గ్మాన్ మరణం : ప్రముఖ స్వీడన్ దర్శకుడు అయిన ఇంగ్మర్గ్ బెర్గ్మాన్ 2007 జూలై 30 వ తేదీన మరణించారు. ఈయన ప్రజలకు ప్రేరణను ఇచ్చే ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా ఈయన తెరకెక్కించిన సినిమాలు ఎందరికో ప్రేరణ కలిగించాయి . దాదాపు అరవై సినిమాలను తెరకెక్కించిన ఈయన ఎంతో గుర్తింపు సంపాదించారు.
Powered by Froala Editor