పోషకాహార లోపానికి  గురైన పిల్లలు శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. వీరిలో ఎదుగుదల లేకపోవడం, అర్థం చేసుకొనే శక్తి లోపించడం జరుగుతుంది. ఈ తరహా పిల్లలు బడి మానివేయడం జరగవచ్చు. వీరిలో జబ్బులను ఎదుర్కొనే శక్తి లోపించడం వల్ల తరచు వ్యాధుల బారిన పడతారు.

 

పిల్లల్లో పౌష్టికాహార లోపం వల్ల కలిగే కొన్ని పర్యవసనాలు తిరిగి సవరించుకోలేనివిగా ఉంటాయి. పోషకాహారం లేకపోవడం అనేది పిల్లల్లో తీవ్ర ఆందోళనలు కలిగించే విషయం, పోషకాహారం తక్కువగా లభించే పిల్లలు తప్పనిసరిగా శారీరక, మానసిక లోపాలకు కూడా గురవుతారు. పిల్లలు ముఖ్యంగా విటమిన్ - ఎ ఐరన్, కాల్షియం, అయొడిన్ వంటి పోషక పదార్థాల లోపానికి గురవుతారు. ఆ లోపాలు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ అవి పిల్లల ఎదుగుదలకు, రోగనిరోధకశక్తి పై ప్రభావం చూపుతాయి

 

 

పిల్లలలో పోషకాహార లోపాన్ని తల్లిదండ్రులు సాధారణంగా గుర్తించలేరు. అదే వయసు గల పిల్లలతో పోలిస్తే వయసుకు తగ్గ బరువు, ఎత్తు లేని పిల్లలను సులభంగా గుర్తించవచ్చు. తీవ్ర పోషకాహార లోపం గల పిల్లలపై దృష్టి సారించకపోతే వారు మరింత తీవ్ర పోషకాహార లోపానికి గురయ్యే అవకాశం ఉంది. క్షయ, మశూచి, నిమోనియా ఇతర శ్వాస సంబంధమైన, ప్రేగు సంబంధమైన వ్యాధులకు, అంటు వ్యాధులకు వారు త్వరగా గురి కావచ్చు.పోషకాహార లోపం గల పిల్లలకు రెట్టింపు ఆహారం ఇచ్చే ఏర్పాటు చేయాలి. తీవ్ర పోషకాహార లోపం గల పిల్లల బరువు కంటే స్వల్ప పోషకాహార లోపానికి గురైన పిల్లల బరువును పెంచడం సులభం. కనుక ప్రాథమిక దశలోనే పోషకాహార లోపాన్ని గుర్తించి, దానిని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవడం అవసరంపిల్లల శారీరక పెరుగుదల వారి ఆరోగ్యాన్ని సూచిస్తుంది.

 

పెద్దవారిలో కంటే పిల్లల్లో శరీర పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించడం, వారికి సమతుల పోషక ఆహారం ఇవ్వడం తల్లిదండ్రులకు ఒక సమస్య. దేశంలో దాదాపు 60 శాతం పిల్లలు బరువు తక్కువగాను, ఎదుగుదల లోపంతోను బాధపడుతున్నారు తీవ్ర పోషకాహార లోపం కారణంగా నంజు జబ్బులు వస్తాయి. జబ్బులు పోషకాహార లేమికి పరాకాష్ట, కాళ్ళు ఉబ్బడంతో నంజు జబ్బు మొదలవుతుంది. క్రమంగా చేతులు మొత్తం శరీరం ఉబ్బుతుంది. కట్టె నంజు పిల్లలు కదిలే అస్తిపంజారాల్లా ఉంటారు.

 

ఈవ్యాధికి గురైన పిల్లల చర్మం గరుకుగా మారుతుంది. చర్మం పొక్కులు లేస్తుంది. జుట్టు దాదాపు ఊడిపోతుంది. వారిలో వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తుంది. ఈ పిల్లలకు చాలా త్వరగా వ్యాధులు సోకుతాయి. కట్టం, ఉబ్బ నంజు పిల్లలను త్వరగా గుర్తించి చికిత్స చేయకుంటే వారు మరణానికి చేరువ అవుతారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: