మట్టికి మనిషికి ఎంతో అనుబంధం.. ఒకప్పుడు ఈ మట్టితోనే జీవనం సాగించేవాడు మనిషి. అందుకే ఎన్ని ఏళ్ళు వచ్చినా ఎంతో దృఢంగా ఉండేవాడు. కానీ నేటి రోజుల్లో ఆధునిక జీవనశైలిలో మట్టి అంటే ఒక మరకగా  భావిస్తున్నారు అందరు. తొలి చినుకు భూమిపై పడినప్పుడు వచ్చే ఆ మట్టి వాసన కూడా అద్భుతమైన వాసన అని ఆస్వాదించడం మానేసి..  బ్యాడ్ స్మెల్ అంటూ ముక్కుమూసుకుంటున్న రోజులు ప్రస్తుతం దాపురించాయి.  ఇలాంటి సమయంలో మట్టి గొప్పతనం గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పురాతన కాలం నుంచి కి మనిషికి మనిషికి మధ్య విడదీయరాని అనుబంధం ఉంది.

 ఎంతోమంది ఈ మట్టిలోనే పంటలు వేసి ఇక రైతులుగా ఏకంగా ఈ నేలమ్మ ఒడిలోనే బ్రతికారు. కానీ ఆ తర్వాత కాలంలో జీవనశైలిలో మార్పు వచ్చింది. క్రమక్రమంగా మట్టి ని దూరం పెడుతూ వచ్చారు.  అయితే మట్టి అంటే పంటలు అందించడం మాత్రమే కాదు ప్రస్తుత కాలంలో ఏ డాక్టర్ కూడా ఇవ్వలేని ఆరోగ్యాన్ని కూడా ఇస్తూ ఉండేది. అందుకే ఒకప్పటి  మనుషులందరూ ఎంతో దృఢంగా ఉండే వారు.  అయితే ఇప్పటి పరమాన్న భోజనాలు ఒకప్పుడు లేవు.  పిజ్జాలు బర్గర్లు అనే మాటే వినలేదు అప్పటి మనుషులు. అప్పట్లో చద్దన్నం లో ఆవకాయ నంజుకుని తింటే అదే పరమాన్నం గా భావించేవారు.

 ఎప్పుడు మట్టిలోనే ఉంటూ మట్టిలోనే జీవనం సాగించేవారు. అందుకే వందేళ్లు వచ్చినా కూడా వారి పని వాళ్ళే చేసుకుని బ్రతికే శక్తి కలిగి ఉండేవారు. అయితే ఈ రోజుల్లో మాత్రం మనుషులు మట్టి కి ఎంత దూరం అయిపోతున్నారు. ఇక అటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను మట్టిలో ఆడ వద్దు అంటూ రిఫ్లెక్షన్స్   పెడుతున్నారు. దీంతో మట్టికి దూరమైన పిల్లల్లో కనీసం ఇమ్యూనిటీపవర్ కూడా లేకుండా పోతుంది. అయితే నేటి రోజుల్లో పరిస్థితి ఎలా మారిపోయింది అంటే ఒకప్పుడు మట్టిలో జీవించిన మనుషులే ఇక ఇప్పుడు ఆ మట్టిలో మమేకం కావడానికి ఒక ఏడాది మొత్తంలో కొన్ని రోజులపాటు అకేషన్  పెట్టుకుని సమయం కేటాయిస్తున్నారు. ఇలా ఒకప్పటి మట్టిమనుషులు ఇక ఇప్పుడు ఆ మట్టికి దూరమై మళ్లీ ఆ మట్టితో మమేకం అవ్వడానికి  పరితపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: