ఈరోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి డయాబెటిస్ సమస్య వస్తుంది. డయాబెటిస్ సమస్య ఉన్నవారు మరింతగా పెరిగిపోతున్నారు. ముఖ్యంగా డయాబెటిక్ పేషంట్లు ఈ సీజన్లో షుగర్ని కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే చలికాలంలో తినే విధానం మారుతుంది. ప్రజలు ఎక్కువగా స్వీట్లు తినడం, ఫ్రైస్ తినటం ప్రారంభిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో డయాబెటిక్ పేషెంట్లు ప్రమాదంలో పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ రోగుల భారీగా పెరుగుతోంది...

 చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ డయాబెటిస్ బారిన పడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.. అయితే..ICMR ప్రకారం భారతదేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు ఉన్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న రోగుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోందని ఐసిఎంఆర్ పేర్కుంది... అయితే.. డయాబెటిక్ పేషెంట్స్ చలికాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే వారి ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు ఈ సీజన్లో షుగర్ ని కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే చలికాలంలో తినే విధానం మారుతుంది. ప్రజలు ఎక్కువగా స్వీట్లు తినడం, ప్రైస్ తినడం ప్రారంభిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు డయాబెటిక్ పేషెంట్లు కోరికలను అదుపు చేసుకోలేరు.

అటువంటి పరిస్థితిలో, చక్కెర స్థాయి పెరిగే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ సీజన్లో తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సీజన్లో డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి పొరపాట్లకు దూరంగా ఉండాలి?.. ఎలాంటి ఆహారం తీసుకోకూడదు... దాని గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..? ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అని ఢిల్లీలోని సీనియర్ వైద్యుడు డాక్టర్ కమల్ జిత్ సింగ్ చెబుతున్నారు. ముఖ్యంగా మీ కోరికలను అదుపులో ఉంచుకోవాలని డయాబెటిస్ పేషంట్లకు సూచించారు. స్వీట్లు, ఫాస్ట్ ఫుడ్ మానుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: