
మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు డబ్బు..? లేదా నాణేలను కనిపిస్తే తీసుకోవడం సరైన పద్ధతి కాదు అని ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు(కేవలం చిల్లర మాత్రమే. బ్యాగుల్లో డబ్బులు..వేలు..లక్షలు ఉండే డబ్బు బ్యాగు కనిపిస్తే పోలీసులకి అప్పగించడం మంచిది). కానీ మన పురాణ గ్రంథాలలో మాత్రం అలా కనిపించిన డబ్బు తీసుకోవడం చాలా చాలా శుభప్రదం అని అంటున్నారు . అలా డబ్బులు కనిపిస్తే పూర్వీకుల నుంచి వచ్చిన ఆశీర్వాదంగా భావించాలి అంటూ చెబుతున్నారు . మీరు రోడ్డుపై డబ్బును చూస్తే మీ పూర్వీకుల నుంచి మీకు ప్రత్యక్ష ఆశీర్వాదం లభిస్తుంది అని .. కొని శాస్త్రాలు చెబుతున్నాయి . అంతేకాదు ఎవరికైనా రోడ్డుపై పడి ఉన్న డబ్బు కనిపిస్తే అక్కడ త్వరలోనే ఏదో కొత్త పని ప్రారంభం కాబోతుంది అని కూడా అర్థం అంటూ కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి .
అంతే కాదు ఎవరైనా ఉద్యోగం రాని వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అలా డబ్బు కనిపిస్తే అది తీసుకుంటే కచ్చితంగా ఉద్యోగం వస్తుందట. లక్ష్మీదేవి కరుణించి ఆ విధంగా ఆశీర్వాదం పంపించింది అని నమ్మాలి అంటున్నారు కొంతమంది పెద్దవాళ్లు . అమ్మవారి అనుగ్రహంతో అకస్మాత్తుగా ఎక్కడినుండో సంపదను పొందే అవకాశం కూడా ఉంటుంది అని అర్థమట . మరి కొందరు మాత్రం అలా దొరికిన డబ్బుని వృధాగా ఖర్చు చేయకుండా జాగ్రత్తగా దాచి పెట్టుకుంటే ఆ సంపద డబుల్ అవుతుందట . లక్ష్మీదేవి ఇంకా ఇంకా డబ్బును ఇస్తుందట.
ముఖ్య గమనిక: ఇది కేవలం ఒక సమాచారం మాత్రమే. డబ్బు దొరకడం శుభప్రదంగా భావించేవారు దీని నమ్ముతారు. కొంతమంది ఇదంతా నమ్మరు . అది మీ అదృష్టానికి సూచన అని భావిస్తారు. ఇది విశ్వసించడం అనేది మీ సొంత అభిప్రాయం మాత్రమే అని గుర్తుంచుకోండి.