ఇప్పుడు ఉన్నదంతా కూడా డిజిటల్ యుగం. ప్రతిది కూడా డిజిటల్ గానే ముందుకు వెళ్తుంది.  మరి ముఖ్యంగా ఏ చిన్న సమాచారం అయినా సరే వాట్సప్ ఇతర సోషల్ మీడియా యాప్స్ ద్వారా సెకండ్స్ లోనే షేర్ చేసుకుంటూ వస్తున్నారు జనాలు . అంతేకాదు సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ ..పలువురు ఉద్యోగులు ..ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్ ఎక్కువగా కూడా షార్ట్ కట్స్ అండ్ ఎమోజీస్ వాడుతూ ఉంటాయి . ఇదంతా డిజిటల్ వరల్డ్ లో ఒక భాగమే . డిజిటల్ వరల్డ్ లో మనం మాట్లాడే భాష నిరంతరం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.


ఒకప్పుడు ఉత్తరాలలో మన భావాలను అక్షరాలలో పొందుపరిచే వాళ్ళం . ఆ ఫీలింగ్ ఏ వేరు అయితే ఇప్పుడు డిజిటల్ యుగం కనుక అంత డిజిటల్ గానే ఫీలింగ్స్ ని కూడా షేర్ చేసుకుంటూ వస్తారు. మరి కొంతమంది ఎమోజీల రూపంలో ఫీలింగ్ ని ఎదుటి వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటారు . పుట్టినరోజు అయితే ఒక ఎమోజి ..బాధపడుతుంటే ఒక ఎమోజి.. హ్యాపీగా ఉంటే మరొక ఎమోజి.. ఇలా రకరకాల ఏమోజీలు  షేర్ చేస్తూ ఉంటారు . అయితే ఇప్పుడు ఎమోజీలలో ధంబ్ సింబల్ పెద్ద తలనొప్పి క్రియేట్ చేసింది .



నేటి యువత ఎక్కువగా పాజిటివిటీ కన్నా నెగిటివిటీ గానే ఆలోచిస్తుంది అని చెప్పడానికి ఇది మరొక బిగ్ ఎగ్జాంపుల్ గా మారింది . థంబ్స్ అప్ సింబల్ ని  సాధారణంగా అంగీకారం తెలుపుతూ వాడుతూ ఉంటాం. ఆమోదం , అంగీకారం లేదా మంచి అనిపించే వాటిని సూచించడానికి మన ఫీలింగ్ తెలియజేస్తూ ఉపయోగిస్తూ ఉంటాం. ఇది ఒకరి అభిప్రాయానికి మద్దతు ఇవ్వడానికి లేదా ఒక పని బాగా జరిగిందని సృష్టించడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో ఇది వ్యంగ్యంగా లేదా ప్రతికూల అర్ధాన్ని కూడా కలిగి ఉంటుంది అని కొంతమంది యువత భావిస్తూ ఉంటారు .



మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బెటిజన్స్ థంబ్స్ అప్  ఎమోజికి సంబంధించి రకరకాలుగా చర్చించుకున్నారు.  సోషల్ మీడియాలో ఒక చిన్నపాటి డిబెట్టే కొనసాగించాడు . దానికి కారణం ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ పెట్టిన పోస్ట్ . సాధారణంగా ఏదైనా సరే కార్పొరేట్ కంపెనీలు లేకపోతే వాట్సప్ గ్రూప్స్ లో ముఖ్యమైన సమాచారాన్ని షేర్ చేసిన తర్వాత ఎదుటి వాళ్ళు దానికి ఓకే అని చెబుతూ అంగీకారం తెలియజేస్తూ థంబ్స్ అప్ ఎమోజిని ఎక్కువగా వాడుతూ ఉంటారు .

 

అయితే అందులో పెద్ద తప్పులేదు  . కానీ ఓ నెటిజన్ మాత్రం అదేదో పెద్ద బూతు అద్దం  వచ్చేలా తనకి ఆ ఎమోజిని చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది అని..  చిరాకు కలుగుతుంది అని.. అసౌకర్యంగా ఉంటుంది అని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు . అది చాలా మొరటుగా సంభాషణ మధ్యలోనే ఆపేసినట్లుగా అనిపిస్తుంది అనేది ఆ నెటిజన్ ఒపీనియన్ . అయితే ఇది సోషల్ మీడియాలో షేర్ చేయగా చాలామంది దీనికి రియాక్ట్ అయ్యారు . మరీ ముఖ్యంగా చాలామంది లవ్ సింబల్ ను థంబ్స్ అప్ సింబల్ ను ఎక్కువగా వర్క్ సంభాషణలో వాడుతూ ఉంటారు అని.. వర్క్  నచ్చితే లవ్ సింబల్ పంపించడం ఏదైనా పనికి ఓకే అని అంగీకారం తెలుపుతూ థంబ్స్ అప్ సింబల్  పంపించడం చాలా చాలా కామన్ అని కొందరు నెటిజన్స్ ఆ ఎంప్లాయ్ కి అర్ధం అయ్యేలా చెప్తుంటే.. మరికొందరు దానికి నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.



ఆ సింబల్స్  అందరికీ నచ్చాలి అని లేదు . ఇందులో పెద్ద బూతు అర్థం కూడా లేదు . ఆ నెటిజెన్ పెట్టిన పోస్టుకు మిగతా జనాలు భారీ రేంజ్ లో కౌంటర్స్ ఇచ్చారు . "నీ ఒపీనియన్ నీ ఇష్టం ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని ఒకరు అంటే..మరి కొందరు మాత్రం అవును ఈ ఎమోజిలతో చచ్చిపోతున్నాం ..ఏదైనా సంభాషణ జరుగుతున్నప్పుడు వెంటనే అది కట్ చేసే విధంగా ఈ  ఎమోజీ చెడదొబ్బుతుంది.. ఇది పెద్ద తలనొప్పిగా మారింది అంటూ ఎమోజిల ని కాస్త పెద్ద డెవిల్ గా చూస్తున్నారు.  కొంతమంది ఈ ఎమోజీ లని బ్యాన్ చేసేయాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు.  దీంతో సిల్లీగా స్టార్ట్ అయిన డిస్కషన్ సీరియస్ డిబేట్ గా మారి సోషల్ మీడియాలో రచ్చ రంబోలా చేసేసింది. మరి మీరు ఏమంటారు ఈ ఎమోజీలు నిజంగానే సంభాషణను స్పాయిల్ చేస్తుందా..? లేక టైప్ చేసే ఒత్తిడిని తగ్గిస్తుందా..?

మరింత సమాచారం తెలుసుకోండి: