మూత్రపిండాలు మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలలో ఒకటి. అవి రక్తాన్ని శుద్ధి చేయడం, అవశిష్ట పదార్థాలను మలమూత్ర రూపంలో బయటకు పంపించడం, శరీరంలో నీటి పరిమాణాన్ని నియంత్రించడం, రక్తపోటును సమతుల్యంగా ఉంచడం వంటి పనులు చేస్తాయి. మూత్రపిండాలు బలంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం, మరియు నీటి వినియోగం చాలా ముఖ్యం. పాలకూర, తోటకూర, గోంగూర, ముల్లంగికూర,  ఇవి విటమిన్ A, C, K, మరియు ఫోలేట్ వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో మూత్రపిండాలను ఫ్రీ రాడికల్స్‌ నుండి రక్షిస్తాయి. మితంగా తీసుకుంటే మూత్రపిండాల పనితీరుకు శక్తినిస్తుంది.

కిడ్నీ సమస్య ఉన్నవారు ఫాస్ఫరస్ స్థాయిని దృష్టిలో పెట్టుకుని తినాలి. బెర్రీస్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, క్రాన్బెర్రీ ఇవి యాంటీ ఆక్సిడెంట్లతో, ముఖ్యంగా యాంటోసైనిన్లతో నిండినవి. మూత్రపిండాల ఇన్ఫెక్షన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. క్రాన్బెర్రీ జ్యూస్ నివారణకు ఉపయోగపడుతుంది. గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, ఫైబర్ అధికంగా ఉండటం వలన టాక్సిన్లను శరీరం నుండి బయటకు పంపించడంలో సహాయపడతాయి. బ్లడ్ షుగర్ లెవెల్ ను నియంత్రించడంలో సహాయపడతాయి, ఇది కిడ్నీ ఆరోగ్యానికి కీలకం. మలబద్ధకం నివారించి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతాయి. పుచ్చకాయ,  ఇది 90% నీటితో కూడిన పండు.

మూత్రాన్ని పెంచి, మూత్రపిండాల ద్వారా విష పదార్థాలను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. ఇందులో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది, ఇది మూత్రపిండాలపై వ్యాధుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ద్రాక్ష & దానిమ్, రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. ఇది కిడ్నీలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటు ఐరన్, విటమిన్ C తో కూడి ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేసి, కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది. గాజర్ జ్యూస్, బీట్‌రూట్ జ్యూస్, ముల్లంగి జ్యూస్, ఇవి శరీరంలో డిటాక్సిఫికేషన్ కు సహాయపడతాయి. బీట్‌రూట్ లో ఉండే నైట్రేట్లు మూత్రపిండాల రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. గాజరులో విటమిన్ A అధికంగా ఉండటంతో కిడ్నీ ఆరోగ్యానికి సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: